NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

US Visa: యుఎస్ వెళ్లే వారికి గుడ్ న్యూస్ .. అమెరికా వీసాల జాప్యం తగ్గించేందుకు దేశ వ్యాప్తంగా కొత్త కాన్సులేట్ కార్యాలయాలు ప్రారంభం

US Visa: భారత్ లో అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు వేచి ఉండే సమయం తగ్గించడం కోసం అమెరికా తమ సిబ్బందిని పెంచడంతో పాటు దేశ వ్యాప్తంగా కొత్త కాన్యులేట్ కార్యాలయాలను ప్రారంభిస్తొందని భారత్ లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్పెట్టి నివేదించారు. బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లో కొత్త కాన్సులేట్ లను ఏర్పాటు చేయనున్నట్లు ఐక్యరాజ్య సమితి రాయబారి పత్రికలకు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ కాన్సులేట్  అదనపు సిబ్బందిని నియమించిందని, వీసా దరఖాస్తుల బ్యాక్ లాగ్ ను తగ్గించడంలో ఇది సహాయపడుతుందని గార్సెట్టి పేర్కొన్నారు.

అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ధ(ఓఆర్ఎఫ్) నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్ లో గార్సెట్టి మాట్లాడుతూ.. అహ్మదాబాద్ లో కాన్సులేట్ ఏర్పాటు కోసం కొత్త ప్రాంగణాన్ని తాను చూడటం జరిగిందన్నారు. తాము సిబ్బందిని పెంచుతున్నందున ఇప్పటికే కొంత మంది అదనపు సిబ్బంది హైదరాబాద్ కాన్సులేట్ లో చేరారన్నారు. కొత్త కాన్సులేట్ ల ఏర్పాటు కోసం బెంగళారు, అహ్మదాబాద్ లలో ప్రాంగణాలను తీసుకుంటున్నారు. అదనంగా, ఇటీవలి వారాల్లో, బ్యాక్ లాగ్ ను తగ్గించే ప్రయత్నాల ఫలితంగా యునైటెడ్ స్టేట్స్ భారతీయులకు మంజూరు చేసిన వీసాల సంఖ్య మూడింట ఒక వంతు పెరిగిందని గార్సెట్టి పేర్కొన్నారు. అధిక సంఖ్యలో దరఖాస్తుదారులు ఉండటం వల్ల వీసాల జారీలో జాప్యం జరిగిందని, మెక్సికో మరియు బ్రెజిల్ వంటి ఇతర దేశాలు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు.

యునైటెడ్ స్టేట్స్ ఎంబసీకి సమర్పించిన దరఖాస్తు రకాన్ని బట్టి, విద్యార్ధులు, మరియు పర్యాటకుల కోసం యుఎస్వీసాల కోసం వేచి ఉండే సమయం కూడా ఆరు నెలల నుండి ఒక సంవత్సరం తగ్గింది. భారత దేశం నుండి భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నందున బ్యాక్ లాగ్ ల సంఖ్య పెరిగిందని, పరిస్థితి యొక్క డిమాండ్ లను కొనసాగించడం కష్టంగా ఉందని గార్సెట్టి వెల్లడించారు.  మరో వైపు కొత్త కార్యాలయాలు మరియు అదనపు సిబ్బంది చేరిక కారణంగా బారతీయ పౌరులకు వీసాలు అందించే ప్రక్రియ వేగవంతం చేయడంపై యుఎస్ దృష్టి సారించింది.

ఈ ఏడాది సెప్టెంబర్ లో భారత్ లోని యునైటెడ్ స్టేట్ ఎంబసీ భారతీయ పౌరులకు ఒక మిలియన్ వీసాలు అందించి దాని మునుపటి రికార్డును అధిగమించింది.  భారతీయులకు మంజూరు చేయబడిన యునైటెడ్ స్టేట్స్ వీసాల సంఖ్య 2022 లో ప్రొసెస్ చేయబడిన మొత్తం వీసాల సంఖ్యను అధిగమించిందని రాయబార కార్యాలయం నివేదించింది. ఇంకా, 2019 మరియు కోవిడ్ సంవత్సరాలతో పోలిస్తే 2023 ల నిర్వహించబడిన దరఖాస్తుల్లో 20 శాతం పెరిగింది. వీసాల జారీ పై నరేంద్ర మోడీ పర్యటన కారణంగా చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

Supreme Court: రాందేవ్ బాబాకు సుప్రీం కోర్టు హెచ్చరిక ..మోసపూరిత ప్రకటనలు ఆపకుంటే భారీ జరిమానా విధించాల్సి వస్తుందంటూ..

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N