పైలట్ కు డిప్యూటీ సీఎం?

రాజస్థాన్ సీఎం ఎవరన్న విషయంలో సస్పెన్స్ కు పూర్తిగా తెరపడనప్పటికీ…గెహ్లీట్ నే ఆ పదవి వరించే అవకాశాలున్నాయన్న సూచనలు అందుతున్నాయి.  సచిన్ పైలట్ డిప్యూటీ తో సరిపెట్టుకోవలసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా రాజేష్ పైలట్ కు సీఎం పదవి ఇవ్వాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఉండగా గెహ్లాట్, సచిన్ పైలట్ల లు ఇరువురూ కూడా రాహుల్ నివాసానికి చేరుకున్నారు. కాగా ఐదు రాష్ట్రాల ఎన్నికలలో మంచి ఫలితాలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని అభినందించేందుకు ఆయన సోదరి ప్రియాంక, రాబర్ట్ వాద్రాలు రాహుల్ నివాసానికి చేరుకున్నారు. ఏది ఏమైనా రాజస్థాన్ లో ప్రభుత్వ పగ్గాలు ఎవరికి  అప్పగించాల్న విషయాన్ని రాహుల్ గాంధీ తేలుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.