NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

RRR: ఆర్ ఆర్ ఆర్ “వెలి”కి వైసిపి పక్కా స్కెచ్ !స్పీకర్ ని సైతం కన్విన్స్ చేసేలా 300 పేజీల నివేదిక సమర్పణ!!

RRR: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై ఎలాగైనా సరే అనర్హత వేటు వేయించాలన్న పట్టుదలతో ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది.ఈ నెల పందొమ్మిది వ తేదీ నుండి జరుగనున్న పార్లమెంటు సమావేశాల్లోనే రఘురామ కృష్ణంరాజుకు చెక్ పెట్టడానికి తెరవెనక తతంగం నడుపుతోంది. ముఖ్యమంత్రి జగన్ పాలనను విమర్శిస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ను అనర్హుడిగా ప్రకటించాలంటూ వైసిపి తీవ్రస్థాయిలో లోక్‌సభ స్పీకర్ పై ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే.

300 Pages report on RRR to speaker
300 Pages report on RRR to speaker

సంవత్సర కాలంగా తమ పిటిషన్ పెండింగ్ లోఉందని, ఈ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోకుంటే పార్లమెంటును స్తంభింపజేస్తామని వైసీపీ అగ్ర నేత విజయసాయిరెడ్డి స్పీకర్ ఓం బిర్లాకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది.ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ నిన్న ఒక వివరణ ఇచ్చారు.వైసిపి పిటిషన్ స్పీకర్ సెక్రటేరియట్ పరిశీలనలో ఉందన్నారు.అయితే ఇరు పక్షాల వాదనలు విన్నాకే తాను ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ చెప్పడం జరిగింది.దీంతో ఈ విషయంలో జాప్యం జరిగే అవకాశముందని భావించిన వైసిపి మళ్లీ తన వ్యూహానికి పదును పెట్టింది.

300పేజీలతో ఆర్ఆర్ఆర్ చిట్టా తయారీ!

ఇందులో భాగంగా రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాల చిట్టాను మూడు వందల పేజీలు తయారుచేసి స్పీకర్ కార్యాలయానికి పంపినట్లు రాజమండ్రి వైఎస్సార్సీపీ ఎంపీ ,లోక్‌సభలో పార్టీ విప్ మార్గాని భరత్ మీడియాకు తెలిపారు.రఘురామకృష్ణంరాజు వైసీపీ వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, వీటిని సాక్ష్యాధారాలతో లోక్ సభ స్పీకర్ కు సమర్పించామని ఆయన చెప్పారు.తాము ఇచ్చిన ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ నుంచి వారం రోజుల్లో రఘురామ కృష్ణంరాజుకు నోటీసులు వస్తాయని మార్గాని భరత్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో శరద్ యాదవ్ పై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వేటు వేసిన విషయాన్ని కూడా స్పీకర్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. ఒకవేళ స్పీకర్ ఆయన వివరణ కూడా తీసుకున్నప్పటికీ తాము సమర్పించిన సాక్ష్యాధారాలు బలంగా ఉన్నందున రఘురామకృష్ణంరాజు పై వేటు పడటం ఖాయమని రాజమండ్రి ఎంపీ తెలిపారు.మొత్తంగా చూస్తే రఘురామ కృష్ణంరాజు విషయంలో అమీతుమీకి వైసిపి సిద్ధపడినట్లు కనిపిస్తోంది. అవసరమైతే పార్లమెంటులో ఇదే విషయాన్ని ప్రధానంగా ఆ పార్టీ టేకప్ చేయనున్న సూచనలు కనిపిస్తున్నాయి

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N