NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

kaushik Reddy: కౌశిక్ రెడ్డికి రేవంత్ వర్గీయుల స్ట్రాంగ్ కౌంటర్!!నువ్వు మరో శ్రీరెడ్డి వంటూ పంచ్ డైలాగులు!

kaushik Reddy: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో తెగ మాటల తూటాలు పేలుతున్నాయి.టీ పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి నియామకం తరవాత తలా ఒక ఈటె విసురుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ కి ఆయన యాభై కోట్లు ఇచ్చి ఈ పదవి దక్కించుకున్నారని ఆరోపణలు సైతం చేస్తున్నారు.ముందుగా ఈ ఆరోపణలను మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేయగా అనూహ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది కరీంనగర్ జిల్లా నేత కౌశిక్ రెడ్డి దాన్ని పునరుద్ఘాటించారు.

Strong counter to kaushik reddy
Strong counter to kaushik reddy

అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముప్పై కోట్లు ఇచ్చి ఈ రేవంత్ రెడ్డి ఈ పదవి పొందారని చెప్పగా కౌశిక్ రెడ్డి దాన్ని యాభై కోట్లకు పెంచారు.అంతటితో ఆగకుండా కౌశిక్ రెడ్డి చాలా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారు.రేవంత్ రెడ్డిని సినిమాల్లో వ్యాంప్ పాత్రలు పోషించే ముమైత్ ఖాన్ తో ఆయన పోల్చారు.దీంతో రేవంత్ రెడ్డి అభిమానులు, అనుచరులు ఫైర్ అవుతూ కౌశిక్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

కౌశిక్ రెడ్డి మరో శ్రీరెడ్డి అన్న కాంగ్రెస్ నేత!

కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి గతంలో ఇదే కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి బూట్లు నాకాడని మీడియా సమావేశంలోనే చెప్పారు.అంతేగాకుండా కౌశిక్ రెడ్డి మరో శ్రీరెడ్డి టైపంటూ కామెంట్ చేశారు.”ముమైత్ ఖాన్‌తో రేవంతన్నను పోలుస్తావా బిడ్డా.. నువ్వే శ్రీరెడ్డిలా వ్యవహరిస్తున్నావు’’ అంటూ కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

పనిలో పనిగా అవినీతి ఆరోపణలు !

కౌశిక్ రెడ్డిపై ఇదే సమావేశంలో పత్తి కృష్ణారెడ్డి అవినీతి ఆరోపణలు చేశారు.హైదరాబాద్‌లోని అత్తాపూర్ సమీపంలో ఓ పెట్రోల్ బంక్, తిరుమల నగర్‌లో మరో పెట్రోల్ బంక్ కౌశిక్ రెడ్డి లీజుకు తీసుకున్నాడని ఆయన వివరించారు. 25 సంవత్సరాల లీజు అగ్రిమెంట్ అయిపోయి ఆ పెట్రోల్ బంక్‌లు మూత పడగా అత్తాపూర్ పెట్రోల్ బంక్ వద్ద 25 గుంటల ప్రభుత్వ స్థలం కౌశిక్ కబ్జా చేసి కుక్కల ఫామ్ పెట్టాడని, ఆ ఆస్తులను కాపాడుకోడానికే టీఆర్ఎస్‌లో చేరుతున్నాడని ఆయన వెల్లడించారు.కౌశిక్ రెడ్డి ఆయన అన్న కోట్లాది రూపాయాలు తీసుకొని జీహెచ్ఎంసీ, జనరల్ ఎలక్షన్లలో టికెట్లు అమ్ముకున్నారని కూడా కృష్ణారెడ్డి తెలిపారు.అలాంటి నీచ చరిత్ర ఉన్న కౌశిక్ రెడ్డి సిగ్గూ శరం లేకుండా రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.ఇదంతా కేసీఆర్ ఇచ్చిన స్క్రిప్ట్ అని కృష్ణారెడ్డి పేర్కొన్నారు.కేసీఆర్ తో జాగ్రత్తగా ఉండు లేకపోతే మునిగిపోతావ్ అంటూ కౌశిక్ రెడ్డికి ఆయన సలహా కూడా ఇచ్చారు.

 

author avatar
Yandamuri

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!