NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రెడ్ల‌కు 57 సీట్లు..ఇదేనా జ‌గ‌న్ రెడ్డి సామాజిక న్యాయం…!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ‌చ్చే అసెంబ్లీ పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ త‌ర‌పున పోటీ చేసే అభ్యర్థుల జాబితా రిలీజ్ చేశారు. ప‌దే ప‌దే జ‌గ‌న్ సామాజిక న్యాయం, సోష‌ల్ ఇంజ‌నీరింగ్ అని చెపుతుండ‌డంతో పాటు నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్సీలు అని చెపుతుంటారు. వారికి తానేదో ఎక్కువ సీట్లు ఇస్తున్నామ‌ని బిల్డ‌ప్ లు పోతుంటారు. కానీ వాస్త‌వంగా జ‌గ‌న్ తాజా జాబితాలో ఎస్సీలు, ఎస్టీల‌కు వారికి రిజ‌ర్వ్ చేసిన సీట్లు మిన‌హా ఒక్క సీటు కూడా ఎక్కువ ఇవ్వ‌లేదు.

ఇక బీసీల‌కు కొన్ని సీట్లు పెంచినా అందులో రాజ‌కీయంగా ఎవ్వ‌రికి తెలియ‌ని వారికి సీట్లు ఇచ్చేసి లెక్క‌ల్లో చూపించేసుకున్నారు. రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల్లో అయితే బ‌లిజ‌, బీసీల‌కు సీట్లు లేకుండా చేసి ప‌డేశారు. బ‌లిజ‌ల‌కు ఉన్న ఒక్క చిత్తూరు సీటును పీకి ప‌డేయ‌గా.. బీసీల‌కు నామ్ కే వాస్తే గా ఒక‌టి రెండు సీట్లు ఇచ్చి మిగిలిన అన్నీ సీట్లు రెడ్ల‌కే క‌ట్ట‌బెట్టేశారు. సీమ‌లో మొత్తం నాలుగు జిల్లాల్లో 80 శాతం సీట్లు రెడ్ల‌కే క‌ట్ట‌బెట్టేశారు.

దీనిని బ‌ట్టి జ‌గ‌న్‌కు త‌న సొంత కులం అంటే ఎంత ప్రేమో తెలుస్తోంది. రాయలసీమలో ఉన్న 52 నియోజకవర్గాల్లో రిజర్వు డ్ సీట్లు పోను జనరల్ సీట్లలో 80 శాతం రెడ్డి సామాజికవర్గం వారే ఉన్నారు. చాలా బీసీ వర్గాలకు ఒక్క సీటు కూడా ఇవ్వ‌లేదు. సీమ‌లో 30 – 35 శాతం బ‌లిజ ఓట‌ర్లు ఉన్నారు. అయితే వీరికి ఒ క్క‌టంటే ఒక్క సీటు కూడా ఇవ్వ‌లేదు. ఇక బీసీల్లోనే కొన్ని వర్గాల ఓట్లు అవసరం లేదనుకున్నారేమో కానీ.. లైట్ తీసుకున్నారు.

ఇక ఎంపీ సీట్ల‌లో కూడా జ‌గ‌న్ మొత్తం 25 పార్ల‌మెంటు స్థానాల్లో 5 సీట్లు వాళ్ల‌కే కేటాయించుకున్నారు. మొత్తం 25 పార్ల‌మెంటు సీట్ల‌లో 4 ఎస్సీ, 1 ఎస్టీ వ‌దిలేస్తే 20 జ‌న‌ర‌ల్ స్థానాలు ఉన్నాయి. ఇందులో 4వ వంతు అంటే 5 సీట్లు రెడ్ల‌కే క‌ట్ట‌బెట్టేశారు. గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ ఎంపీ సీట్లు అన్నీ రెడ్ల‌కు గంప‌గుత్త‌గా క‌ట్ట‌బెట్టేసి మిగిలిన వ‌ర్గాల‌కు తీర‌ని అన్యాయం చేశారు. ఒంగోలు, నెల్లూరు, క‌డ‌ప‌, రాజంపేట‌, నంద్యాల సీట్లు రెడ్డి వ‌ర్గానికే ఇచ్చేశారు. ఏదేమైనా జ‌గ‌న్ నా బీసీ, ఎస్సీ, ఎస్టీలు అంటూ చెప్ప‌డం ఒక‌టి.. చేసేది మ‌రొక‌టిగా క‌నిపిస్తోంది.

Related posts

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju