NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పిఠాపురంలో అన్నీ ఆల్ సెట్‌.. ప‌వ‌న్ మెజార్టీ ఎన్ని వేలంటే…!

కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో అటు విశాఖ జిల్లాలో జ‌న‌సేన పార్టీకి ఒక్క సారిగా ఊపు వ‌చ్చింది. ప‌వ‌న్ 2019 ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని భీమ‌వ‌రంతో పాటు అటు విశాఖ పార్ల‌మెంటు ప‌రిధిలో ఉన్న గాజువాక రెండు స్థానాల్లో ఎమ్మెల్యే గా పోటీ చేశారు. అయితే దురదృష్ట వ‌శాత్తు ప‌వ‌న్ రెండు చోట్లా కూడా ఓడిపోయారు. అయితే ఈ సారి ప‌వ‌న్ తాను గ‌త ఎన్నికల్లో పోటీ చేసిన భీమ‌వ‌రం లేదా గాజువాక రెండు స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు.

ప‌వ‌న్ ఈ సారి భీమ‌వ‌రం నుంచి పోటీ చేస్తే బంప‌ర్ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడ‌తార‌నే అనుక‌న్నారు. క‌ట్ చేస్తే ప‌వ‌న్ ఈ సారి పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో ట్విస్ట్ ఇచ్చేశారు. భీమ‌వ‌రం, గాజువాక రెండు స్థానాల‌ను వ‌దిలేసుకున్నారు. గాజువాక పొత్తులో భాగంగా టీడీపీకి వ‌దిలేశారు. ఇటు భీమ‌వ‌రం సీటును టీడీపీ మాజీ ఎమ్మెల్యే పుల‌ప‌ర్తి అంజిబాబు కు జ‌న‌సేన కండువా క‌ప్పి ఆయ‌న‌కు కేటాయించారు. ప‌వ‌న్ తాను కాకినాడ జిల్లాలోని పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ప‌వ‌న్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న‌ట్టు చెప్ప‌గానే అక్క‌డ టీడీపీ ఇన్‌చార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ తో పాటు ఆయ‌న అనుచ‌ర గ‌ణం తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ప‌వ‌న్ పోటీ చేస్తే తాము ఓడిస్తామంటూ టీడీపీ కేడ‌ర్ శ‌ప‌థాలు చేసింది. సాక్షాత్తూ పొత్తులో భాగంగా జ‌న‌సేన అధినేత పోటీ చేస్తే స్వాగ‌తించాల్సింది పోయి అక్క‌డ టీడీపీ కేడ‌ర్ పార్టీ ఆఫీస్ ధ్వంసం చేసి, జెండాలు త‌గ‌ల పెట్ట‌డంతో అస‌లు ఇదేం మిత్ర ధ‌ర్మం అంటూ ఏపీ వ్యాప్తంగా ఉన్న జ‌నసేన కేడ‌ర్ కూడా అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.

దీంతో చంద్ర‌బాబు వ‌ర్మ‌ను పిలిపించుకుని హామీ ఇచ్చారు. ప‌వ‌న్‌ను మంచి మెజార్టీతో గెలిపించుకు వ‌స్తే ప్ర‌భుత్వం ఏర్ప‌డిన వెంట‌నే తొలి ప‌ద‌వి నీకే ఇస్తాన‌ని తెలిపారు. దీంతో వ‌ర్మ చ‌ల్ల‌బ‌డ్డారు. ఇప్పుడు అక్క‌డ వ‌ర్మ ప‌వ‌న్‌ను గెలిపించేందుకు కంక‌ణం క‌ట్టుకున్నారు. వ‌ర్మ‌కు పిఠాపురంలో పార్టీల‌తో సంబంధం లేకుండా బ‌లం ఉంది. వ‌ర్మ 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఏకంగా 48 వేల ఓట్ల మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. ఆ ఎన్నిక‌ల్లో వ‌ర్మ‌కు చంద్ర‌బాబు సీటు ఇవ్వ‌లేదు.

అయితే వ‌ర్మ ఇండిపెండెంట్‌గా పోటీ చేయ‌డంతో టీడీపీ నుంచి పోటీ చేసిన క్యాండెట్‌కు డిపాజిట్ కూడా ద‌క్క‌లేదు. వ‌ర్మ అసంతృప్తితో ఆయ‌న్ను త‌న వైపున‌కు తిప్పుకుని వైసీపీ సీటు ఇస్తుంద‌న్న ప్ర‌చారం బాగా జ‌రిగింది. అయితే వైసీపీ త‌మ క్యాండెట్‌ను మార్చ‌లేదు. వైసీపీ కూడా వంగా గీతనే అభ్యర్థిగా ప్రకటించింది. ఇక మార్పులు ఉండే అవకాశం లేదని అంచనాకు వచ్చారు. ఇక వ‌ర్మ కూడా ప‌వ‌న్ కోసం క‌ద‌ల‌డంతో ప‌వ‌న్‌కు 40 – 50 వేల ఓట్ల మెజార్టీ వ‌స్తుంద‌న్న అంచ‌నాలు అయితే బ‌లంగా ఉన్నాయి.

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?