కొన్నేళ్ల క్రితం వరకు తెలుగు బుల్లితెరపై రవి, లాస్య జోడీ ఎంత ఫేమస్సో మనకి తెలిసిందే. అప్పట్లో వీరు స్టార్ మా లో సంథింగ్ స్పెషల్ ప్రోగ్రామ్‌తో చాలా పాపులర్ అయ్యారు. అలాంటి ఈ జంట సడన్ గా తెర మీద కనిపించకుండా అయిపోయారు. వీరి మధ్య అప్పట్లో ఓ లవ్ ట్రాక్ నడిచిందంటూ వార్తలు వచ్చాయి. వీరిద్దరూ విడిపోయాక లాస్య ఎప్పుడూ రవి గురించి పెద్దగా మాట్లాడలేదు. లాస్య క్రేజ్ వేరని అంటూ ఉండేది.
ఇక లాస్య ఇటీవల స్టార్ మా లో ప్రసారమయ్యే బిగ్‌బాస్ 4 లో పాల్గొన్న సంగతి విదితమే. అయితే, ఈ షో లో లాస్య కు ఉన్న పాపులారిటీ తో ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ చివరకు 11వ వారంలో ఆమె ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బైటకు వచ్చేసింది. ఇదిలా ఉంటే తాజాగా కొన్ని సంవత్సరాల తరువాత మళ్లీ రవి – లాస్య ల జోడీ బుల్లితెరపై సందడి చేయనున్నట్లు సమాచారం. ఇటీవల రవి తన సోషల్ మీడియాలో వీరిద్దరు మళ్లీ కలిసి చేసే ప్రోగ్రామ్ ప్రోమోను షేర్ చేశాడు.
పోస్ట్ చేస్తూ రవి తన డిస్క్రిప్షన్ లో ‘నిన్ను ఏ విషయంలో అయినా నేను ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించు’ అని పేర్కొన్నాడు. ఇదంతా చూస్తుంటే వీరిద్దరి మధ్య సంవత్సరాలుగా ఉన్న మనస్పర్థలు తొలిగిపోయాయని తెలుస్తుంది. వీరిద్దరూ కలిసి చేసే ప్రోగ్రామ్ సంక్రాంతికి ప్రసారం కానున్నది. ఇట్స్ ఏ ఫ్యా మిలీ పార్టీ పేరుతో ఈ ప్రోగ్రాం ప్రసారం కానుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏమనగా రవి – లాస్య లు మళ్లీ కలవడానికి గల కారణం బిగ్‌బాస్ సీసన్ 4 విన్నర్ అభిజిత్ అని టాక్ నడుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!