Acharya : ఆచార్య Acharya సినిమా రిలీజ్ డేట్ ని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. మెగాస్టార్ హీరోగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ ముఖ్య పాత్రలో కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆచార్య సినిమా రూపొందుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్ – మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతోంది. మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ పాల్గొంటున్న కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.
అయితే మే 13 న ఆచార్య రిలీజ్ దేశ వ్యాప్తంగా ఉండబోతుందని అధికారకంగా ప్రకటించారు. అయితే ఆచార్య రిలిజ్ అయిన తర్వాత రోజే వెంకటేష్ నటిస్తున్న నారప్ప రిలీజ్ డేట్ ని ప్రకటించారు. దాంతో చిరంజీవి – వెంకటేష్ ల మధ్య బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉంటుందనుకున్నారు. అంతేకాదు ఆచార్య మీదే ఎక్కువగా అంచనాలు కూడా ఉన్నాయని నారప్ప కథ ఇప్పటికే తెలిసింది కాబట్టి వెంకీ కి కాస్త దెబ్బ పడే అవకాశం ఉందని మాట్లాడుకున్నారు. కాని తాజాగా ఆచార్య రిలీజ్ డేట్ మారిందని సమాచారం.
Acharya : ఆచార్య సినిమాతో బరిలోకి దిగుతున్నాడని అంటున్నారు.
మే 13 నుంచి మే 28 కి మారినట్టు తెలుస్తోంది. ఆ రోజు నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిబి 3 రిలీజ్ కాబోతోంది. అంతేకాదు మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమా కూడా అదే రోజు రిలీజ్ చేయబోతున్నారు. బాలయ్య – రవితేజ మధ్య వార్ ఉండబోతుందని అందరూ భావిస్తే ఇప్పుడు ఈ ఇద్దరికి పోటీగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో బరిలోకి దిగుతున్నాడని అంటున్నారు. ఇదే నిజమైతే వెంకీ సేఫ్ అవుతాడు. బాలయ్య – రవితేజ ఇరాకటంలో పడ్డారని చెప్పుకుంటున్నారు.