Adani Hindenburg: మన దేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు అంటే ఇప్పటి వరకు టక్కున గుర్తుకు వచ్చే పేరు ఆదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ ఆదానీ. 14 సంవత్సరాల నుండి ఆసియాలోనే అత్యంత ధనంవంతుడిగా వెలుగొందిన అంబానీని వెనక్కి నెట్టి ఆదానీ మొదటి స్థానానికి వచ్చారు. అయితే ఆదానీ గ్రూపు స్టాక్ మార్కెట్ లో పెద్ద ఎత్తున ప్రాడ్ కు పాల్పడిందని ఆమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆదానీ షేర్లు లోఅమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. గౌతమ్ ఆదానీ సంపద స్టాక్ మార్కెట్ సెషన్ లో మరింత భారీగా పతనమైంది. ముదుపరులకు రూ.4లక్షల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. హిండెన్ బర్గ్ ఆరోపణల నేపథ్యంలో ఆదానీ గ్రూపు కంపెనీలు బుధవారమే లక్షల కోట్ల రూపాయల మార్కెట్ విలువను కోల్పోయాయి.
హిండెన్ బర్గ్ నివేదికలోని అంశాలను గౌతమ్ ఆదానీ నేతృత్వంలోని అదానీ గ్రుపు తీవ్రంగా ఖండించినప్పటికీ ఆదానీ గ్రూపు షేర్ల పతనం శుక్రవారం కూడా కొనసాగింది. మొత్తం పది నమోదిత సంస్థల్లో ఏడు కంపెనీల షెర్లు భారీ నష్టాన్ని చవి చూశాయి. దీంతో రెండు వరుస సెషన్లలో ఆదానీ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4 లక్షల కోట్లకుపైగా కరిగిపోయింది. ఆదానీ గ్రీన్, ఆదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్ మిషన్ షేర్లు 20 శాతానికి పైగా నష్టపోయాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్ 18 శాతం నష్టపోయింది. ఇటీవలే ఆదానీ గ్రూపులో చేరిన అంబుజా సిమెంట్స్ షేరు 17.33 శాతం (షేరు విలువలో సుమారు నాలుగో వంతు) నష్టపోయింది. అదానీ పవర్ 5 శాతం, ఆదానీ విల్మర్ 5 శాతం, ఎన్ డీ టీవీ షేరు 4.99 శాతం పతనమై లోయర్ సర్క్యులేట్ ని తాకాయి. ఒక్క రోజు 5.90 బిలియన్ డాలర్లు అంటే బారత కరెన్సీలో ఇది రూ.49 వేల కోట్లకు పైగా నష్టపోయారు.

గౌతమ ఆదానీ సంపద పడిపోవడంతో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 10 లో మూడో స్థానం నుండి నాలుగో స్థానానికి పడిపోయారు. అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ మూడో స్థానానికి చేరారు. ఇదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కూడా ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో టాప్ 10 లో చోటు కోల్పోయారు. అయితే ఆదానీ గ్రుపు తన స్టాక్స్ లో భారీ అవకతవకలకు పాల్పడుతోందనీ, అకౌంటింగ్ మోసాలు కూడా చేస్తొందని, దశాబ్దాల కాలంగా స్టాక్ మానిపులేషన్ జరుగుతోందని హిండెన్ బర్గ్ తన పరోధన నివేదిక వెల్లడించడంతో ఆదానీకి తీవ్ర నష్టం జరిగింది.
అయితే హిండెన్ బర్గ్ రిపోర్టుపై న్యాయపరమైన చర్యలు చేపట్టడానికి గల అవకాశాలు చూస్తున్నట్లు ఆదానీ గ్రూపు ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత పౌరుల్లో అనవసర భయాలను సృష్టించిందని ఆదానీ గ్రూపు లీడ్ హెడ్ జతిన్ జలుంద్వాలా పేర్కొన్నారు. ఆదానీ గ్రుపు కంపెనీల షేర్ల విలువపై ప్రతికూల ఫ్రభావం పడేలా నివేదికలోని అంశాలను రూపొందించారని అందు కోసం నిరాధార ఆంశాలను పొందుపర్చారని ఆయన తెలిపారు. పెట్టుబడి దార్ల సమూహాన్ని, అదానీ గ్రుపు ప్రతిష్టను దెబ్బతీసేలా ఒక విదేశీ సంస్థ చేసిన ఉద్దేశపూర్వక ప్రయత్నం బాధ కలిగించిందని వెల్లడించారు. భారత, అమెరికా చట్టాల ప్రకారం చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు.
అదానీ గ్రూపు ప్రధాన సంస్థ అదానీ ఎంటర్ ప్రైజెస్ రూ.20వేల కోట్ల ఎఫ్ పీ ఓ ( ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్) ఈ నెల 27వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో దానికి ఆదరణ దక్కకూడదనే ఉద్దేశంతోనే హిండెన్ బర్గ్ ఇలా చేసిందని పేర్కొన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారే కానీ హిండెన్ బర్గ్ పై ఆదానీ గ్రూపు దావా వేసే ఆలోచనలో ఉన్నట్లు సంస్థ ప్రకటించకపోవడం గమనార్హం.
ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో ఎదురుదెబ్బ
మరో పక్క ఆదానీ గ్రుపు హెచ్చరిక నేపథ్యంలో హిండెన్ బర్గ్ స్పందించింది. ఆదానీ గ్రుపుపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామనీ స్పష్టం చేసింది. ఇందుకు అధారాలు తమ వద్ద పలు పత్రాలు ఉన్నాయని కూడా తెలిపింది. నివేదికలో తాము సూటిగా వేసిన 88 ప్రశ్నల్లో ఒక్క దానికి కూడా ఆదానీ గ్రుపు సమాధానం ఇవ్వలేదని వెల్లడించింది. ఆదానీ గ్రుపు కనుక అమెరికా కోర్టులో దావా వేస్తే ఆ కంపెనీకి చెందిన మరిన్ని పత్రాలు ఇమ్మని కోరతామని హిండెన్ బర్గ్ తేల్చి చెప్పింది. కాగా ఆదానీ గ్రూపుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సెబీ, ఆర్ బీ ఐ లతో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దేశ ఆర్ధిక వ్యవస్థ స్థిరత్వం, భద్రతలను నిర్దారించే బాధ్యత ఈ రెండు సంస్థలపై ఉన్నందున వీటిపై సీరియస్ దర్యాప్తు అవసరమని కాంగ్రెస్ పేర్కొంది.
Adani Hindenburg: Is Gautam Adani still the richest man in Asia after the Hindenburg led short selling in Adani Group Companies stocks?