Agent : ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఏజెంట్ భైరవ, గూడాచారి, ఇలాంటి సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో చాలానే వచ్చాయి. అలాంటి సినిమానే ఇంకొకటి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా అఖిల్ 5వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం అఖిల్ ఏజెంట్ అనే సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. ఎప్పటిలాగే ప్రతి హీరో బర్త్ డే సందర్భంగా టీజరో, ట్రైలరో, లేక పోస్టరో రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాగే అఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు అఖిల్ లుక్‌ని రిలీజ్ చేసి అఖిల్ ఫాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చారు.ఈ న్యూ లుక్ అక్కినేని అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్‌ని ఎంతో ఆకట్టుకుంటుంది.
ఫస్ట్ లుక్ పోస్టర్ తో దర్శకుడు సురేందర్ రెడ్డి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ఒక షాంపిల్ ని వదిలాడు. అఖిల్ కెరీర్ ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకి ఏమాత్రం సంబంధం లేకుండా ఏజెంట్ సినిమా రాబోతోంది. ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందబోతుంది. అఖిల్ ని ఒక లవర్ బాయ్ గా, ఫ్యామిలీ మాన్ గా చూశారు. మరి ఏజెంట్ గా ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి. గతంలో సురేందర్ రెడ్డి చేసిన రేసు గుర్రం, కిక్ , అతిథి, ధృవ, సైరా లాంటి ఎన్నో సినిమాలని విభిన్న కథంశాలను తెరకెక్కించారు. అందులో కొన్ని సక్సస్ ని కొన్ని ఫ్లాప్స్ ని ఇచ్చాయి. ఈ ఏజంట్ సినిమా వీటికన్న భిన్నంగా ఉండబోతుందట. థ్రిల్లర్ సినిమాలు ఎన్నో వచ్చిన ఇది హాలివుడ్ మూవీస్ ని తలిపించేదిగా ఉండబోతుందట.
Agent : అఖిల్ కి ఈ సినిమా తో సక్సస్ 100% గ్యారెంటి.
ఇదిలా ఉండగా టైటిల్ అండ్ పోస్టర్ ని చూసి అభిమానులు, ప్రేక్షకులు,ఇండస్ట్రీ వర్గాల వారు అఖిల్ కి ఈ సినిమా తో సక్సస్ 100% గ్యారెంటి అని అనుకుంటున్నారట. కాగా అఖిల్ ఏజెంట్ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ మాత్రమే కాదు తాజాగా మరో అద్భుతమైన పోస్టర్ని రిలీజ్ చేశారు. సిక్స్ ప్యాక్‌తో అఖిల్ అదరగిట్టబోతున్నట్టు తాజా పోస్టర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ సినిమాని అనిల్ సుంకర- ఎకె ఎంటర్ టైన్మెంట్స్ – సురేందర్ 2 సినిమా బ్యానర్స్‌లో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు.థమన్ సంగీతమందిస్తున్నాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!