టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది హన్సిక మొత్వాని. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని అందరినీ ఆకట్టుకుంది. హీరోయిన్ గా పరిచయమైన అతికొద్ది కాలంలోనే తెలుగు, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించింది. అంతేకాదు ఈ మూడు చిత్ర పరిశ్రమలలో విపరీతమైన క్రేజ్ ని సాధించింది.
ఇక ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే ప్రేక్షకులు చూపించే అభిమానం అంతా ఇంతా కాదు. ఏకంగా గుడి కట్టించిన వాళ్ళు ఉన్నారు. అంత అభిమానం చూపిస్తూనే తన అభిమాన నటి కి సంబంధించిన ప్రతీ విషయంలోను ఆరా తీస్తుంటారు. కళ్ళకి పెట్టుకునే కళ్ళజోడు..చేతికి పెట్టుకునే వాచ్..హ్యాండ్ బ్యాగ్..ఈవెంట్స్ లో ధరించే డ్రెస్ రేట్ ..ఇలా ప్రతీ ఒక్కదాని గురించి ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీగా తెలుసుకునేందుకు తాపత్రయ పడుతుంటారు.
ముఖ్యంగా హీరోయిన్ల బ్యాగ్స్ కాస్త వేయిట్ ఎక్కువగానే ఉనటాయి. హీరోయిన్స్ తమ బ్యాగ్ లో ఎక్కువగా ఏం దాచుకుంటామన్న విషయాన్ని కొంతమంది వెల్లడించారు. చాలా మంది తన ఫోన్, లిప్ స్టిక్, పెర్ఫ్యూమ్స్, మేకప్ కిట్ లాంటివి ఎక్కువగా దాచుకొని తిరుగుతుంటారు. తాజాగా ఈ లిస్ట్ లోకి హన్సిక కూడా చేరింది. తన హ్యాండ్ బ్యాగ్ లో వస్తువులు పెద్దగా మారవని.. హ్యాండ్ బ్యాగ్ మాత్రం ఎప్పటికప్పుడు మారుతుందని క్యూట్ గా చెప్తోంది.
“నా దగ్గర చాలా బ్యాగ్స్ ఉన్నాయి.. అందుకే ప్రతి సోమవారం నా హ్యాండ్ బ్యాగ్ మారుస్తాను. ప్రతి బ్యాగ్ కు ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం ఇస్తాను. నా వస్తువులు మోసే ఛాన్స్ కల్పిస్తాను.” అంటూ ఫన్నీగా చెప్పింది. ఇది విన్న వాళ్ళకి నిజంగానే ఒక క్షణం ఇదేం అలవాటు అని ఆశ్చర్యపోక మానరు.
అంతే కాదు హన్సిక కి ఇంకో విచిత్రమైన అలవాటుంది. ఎవరైనా పెంపుడు కుక్కలకు ముద్దుపేర్లు పెట్టుకుంటారు. కానీ హన్సిక మాత్రం తన హ్యాండ్ బ్యాగ్స్ కు కూడా ముద్దుపేర్లు పెట్టుకుంటుంది. బ్యాగ్స్ ను ముద్దు పేర్లతో పిలవడం తనకు చాలా ఇష్టమట. ఇక బ్యాగ్ లో ఎక్కువగా కరోనా కాలం కాబట్టి రెండు మాస్కులు, ఓ శానిటైజర్ తప్పకుండా పెట్టుకుంటానని చెబుతోంది హన్సిక. వీటితో పాటు ఓ 5 రకాల పెర్ఫ్యూమ్స్, మినీ మేకప్ కిట్, తన పర్సు కూడా హ్యాండ్ బ్యాగ్ లోనే ఉంటుందని.. ఆ పర్సులో డ్రైవింగ్ లైసెన్స్, క్రెడిట్-డెబిట్ కార్డులు, కొంత డబ్బుతో పాటు అమ్మ ఫొటో కూడా ఉంటుందని చెప్పింది హన్సిక.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!