Arha : మొన్నటి వరకు స్టైలీష్ స్టార్‌గా పిలిపించుకున్న అల్లుఅర్జున్ ఒక్కసారిగా ‘ఐకాన్ స్టార్’గా మారిపోయారు. ‘పుష్ప’(Pushpa) సినిమా టీజర్ లాంచింగ్ సమయంలో దర్శకుడు సుకుమార్ అల్లుఅర్జున్‌కు ఈ బిరుదును ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో టాలీవుడ్లో వరుస హిట్ సినిమాలతో జోరుమీదున్నాడు. ఇక మనోడి పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. అల్లు అర్జున్- స్నేహా(Allu Arjun-sneha) దంపతులకు ఇద్దరు పిల్లలు. అల్లు అయాన్, అల్లు అర్హ.. వీరి అల్లరి గురించి ఎంత చెప్పినా తక్కువే.
Allu Arjun: గుడిసెలో హోటల్ లోకి వెళ్లి… ఓనర్ కి ఊహించని షాక్ ఇచ్చిన అల్లు అర్జున్..!!
అల్లు ఫ్యామిలీలో చిచ్చర పిడుగు ఎవరంటే..
ముఖ్యంగా అల్లు అయాన్(Ayan) కంటే అర్హనే ఎక్కువగా అల్లరి చేస్తుందని, మా ఇంట్లో చిచ్చర పిడుగు తనే అని ఐకాన్ స్టార్ పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చారు. అయితే, క్యూట్ గర్ల్ అర్హ ఇటీవల ‘శాకుంతలం’(shakuntalam) చిత్రంతో బాల నటిగా తొలిసారిగా వెండి తెరకు పరిచయం అవుతోంది. ఇక అన్నచెల్లెల్లు ఇద్దరూ కలిసి పెయింటింగ్ చేస్తే ఎంత సందడి చేస్తారో తెలుసా.. ఆ రచ్చ మాములుగా ఉండదు.. దానికి ఈ ఈ ఫోటోలే నిదర్శనం. తల్లి స్నేహారెడ్డితో కలిసి అల్లు వారసులు ఇద్దరూ వాల్ పెయింటింగ్‌లో(painting) భాగం పంచుకున్నారు. గోడకు రంగులద్దుతూ బిజీబిజీగా కనిపించారు. అయితే వీరిద్దరూ తల్లి గైడెన్స్‌లో పెయింటింగ్స్ ఎలా వేయాలో నేర్చుకుంటున్నట్టు ఫోటోలో కనిపిస్తోంది.
Allu arjun: ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ ఆ డైరెక్టర్‌కు కమిటవుతాడా..?
తండ్రికి పోటీగా అర్హ అడుగులు..
ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అల్లరిలో డాడీ అల్లుఅర్జున్‌తో పోటీ పడటమే కాకుండా అటు సినిమాలోనూ, ఇటు పెయింటింగ్‌లోనూ క్యూట్ అర్హ తండ్రి వలే అన్నింటిలోనూ రాణిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వాల్ పెయింట్ వేస్తున్న సమయంలో తల్లి పక్కనే నిలబడిన అర్హ.. పెయింటింగ్ గురించి కొత్త విషయాలు తెలుసుకుంటున్నట్టు చిత్రం చూపిస్తుంది. అయాన్ తల్లి వెనుక నిలబడి చేతిలో బ్రష్ పట్టుకుని తన పనిలో బిజీగా మారిపోయాడు.
Allu Arjun: అల్లు అర్జున్ కోసం ఇద్దరు హీరోయిన్లను సెట్ చేస్తున్నా డైరెక్టర్..??