Allu arjun: ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ ఆ డైరెక్టర్‌కు కమిటవుతాడా..?

Share

Allu arjun: గతకొన్ని రోజులుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ చేయబోయో సినిమా గురించే ఇండస్ట్రీ వర్గాలలో, అభిమానుల్లో ప్రేక్షకుల్లో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. అందుకు కారణం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ వరల్డ్ సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. అంతేకాదు ఒక్కో ప్రాజెక్ట్‌ను జెట్ స్పీడ్‌లో కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్ కంప్లీట్ చేసిన మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తమ నెక్స్ట్ సినిమాలను అనౌన్స్ చేశారు. ఇక చరణ్ ఆల్రెడీ శంకర్ తో చేస్తున్న పాన్ ఇండియన్ సినిమాను మొదలు పెట్టాడు.

is allu-arjun next movie with boyapati srinu...?
is allu-arjun next movie with boyapati srinu…?

ఎలాగో పవన్ కళ్యాణ్ వరుసబెట్టి కమిటైన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి కూడా అనౌన్స్ చేసిన సినిమాలను పట్టాలెక్కిస్తూ వస్తున్నారు. సీనియర్ హీరోలు వెంకటేశ్, నాగార్జున, బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ కొత్త సినిమాలను అనౌన్స్ చేసేస్తున్నారు. రవితేజ, నానీ కూడా ఏమాత్రం తగ్గడం
లేదు. రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలను అనౌన్స్ చేస్తున్నారు. ఇలా దాదాపు టాలీవుడ్‌లో ఉన్న ఏ స్టార్ హీరో కూడా రేస్‌లో వెనక్కి తగ్గేదే లే అనేట్టుగా నెక్స్ట్ సినిమాలను ప్రకటిస్తూ వస్తున్నారు.

Allu arjun: ఐకాన్ గురించి మాత్రం ఎలాంటి అప్‌డేట్ రావడం లేదు.

కానీ ఐకాన్ స్టార్ మాత్రం ఇప్పుడు చేస్తున్న పుష్ప తర్వాత ఏ దర్శకుడితో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడో చెప్పడం లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప మూవీ రెండు పార్ట్ భాగాలుగా రాబోతున్న విషయం తెల్సిందే. అయితే పార్ట్ 1 అండ్ పార్ట్ 2కు మధ్య గ్యాప్‌లో మరో సినిమా చేయాలని అల్లు అర్జున్ అనుకుంటున్నట్టు.. ఆ సినిమా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అంటూ నిన్నా..మొన్నటి వరకు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

కాని ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ఇంకోలా ఉంది. ఐకాన్ సినిమాను ఇప్పుడు అల్లు అర్జున్ చేసే ఆలోచనలో ఉన్నాడా.. లేడా అని టాక్ మొదలు అయ్యింది. ఆల్రెడీ అధికారిక ప్రకటన వచ్చిన ఐకాన్ సినిమా అల్లు అర్జున్ ఎప్పటికి పట్టాలెక్కిస్తాడు అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. పుష్ప పార్ట్ 1 డిసెంబర్ 17న రిలీజ్ కానుంది. ఇంకొన్ని రోజుల్లో అల్లు అర్జున్ ఫ్రీ అయిపోతాడు. కాని ఐకాన్ గురించి మాత్రం ఎలాంటి అప్‌డేట్ రావడం లేదు. అంతేకాదు దిల్ రాజు నుంచి కూడా ఐకాన్ గురించిన అధికారిక ప్రకటన ఏదీ లేదు.

Allu arjun: అల్లు అర్జున్ ..ఇప్పుడు బోయపాటితో మూవీ చేస్తాడా..?

కాగా ఇటీవల అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ గురించి అల్లు అరవింద్, బన్నీ వాసు ..బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉంటుందని హింట్ ఇచ్చారు. గీతా ఆర్ట్స్ లోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియన్ సినిమా మొదలవబోతుందని బన్నీ వాసు బ్యాచ్ చెబుతున్నారు. అన్నీ అనుకునట్టు జరిగితే ఈ సినిమాను 2022 సంక్రాంతి తర్వాత ప్రారంభించే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటికే అల్లు అర్జున్ తో సరైనోడు సినిమాను చేశారు బోయపాటి. ఈసారి అంతకు మించి భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. కానీ దీని గురించి కూడా అఫీషియల్ కన్‌ఫర్మేషన్ లేదు. అయితే అల్లు అర్జున్ ..ఇప్పుడు బోయపాటితో మూవీ చేస్తాడా..అనే కొత్త సందేహాలు మొదలైనట్టు వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.


Share

Related posts

మరో భారీ ప్రాజెక్ట్ సైన్ చేసిన ప్రభాస్

Siva Prasad

నవంబర్ 21న `మామాంగం`

Siva Prasad

Gali Sampath : క్యాష్ షోలో గాలి సంపత్ సందడి?

Varun G