Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ Allu Arjun గత ఏడాది “అలా వైకుంఠపురం లో” సినిమాలో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రాకముందు “నాపేరు సూర్య” అనే దారుణమైన డిజాస్టర్ అందుకున్న బన్నీ దాదాపు కొన్ని సంవత్సరాల పాటు మరో సినిమా ఒప్పుకోవడానికి చాలా టైం తీసుకోవడం జరిగింది. ఆ టైంలో చాలా కథలు విన్నా గానీ చివరాకరికి త్రివిక్రమ్ చెప్పిన “అల వైకుంఠ పురంబులో” సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని 2020 లో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డులను పగలగొట్టాడు అల్లు అర్జున్.
ఇదిలా ఉంటే ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లారీ డ్రైవర్ గా గంధపు చెక్కల స్మగ్లర్ గా బన్నీ క్యారెక్టర్ ఉంటుంది అని ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ గుబురు గడ్డం తో పాటు చాలా డిఫరెంట్ స్టైల్ లో తన మేక్ ఓవర్ ఉండేలా చూసుకుంటూ ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 13వ తారీకు రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది.అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా లో స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నాడట. నీటి కాలుష్యం పై సినిమా స్టోరీ ఉంటుందని సోషల్ మెసేజ్ రూపంలో కొరటాల ఈ సినిమా చేయబోతున్నట్లు ఆచార్య కంప్లీట్ అయిన వెంటనే అల్లు అర్జున్ తో ఈ సినిమా మొదలు చేయనున్నట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!