NewsOrbit
న్యూస్

Srilakshmi : రావమ్మా శ్రీలక్ష్మి! జగన్ సిఎస్ చేసుకోవడానికి చూస్తున్నారా??

Srilakshmi : రావమ్మా శ్రీలక్ష్మి! జగన్ సిఎస్ చేసుకోవడానికి చూస్తున్నారా??

Srilakshmi : తెలంగాణ నుంచి ఏరి కోరి ఆంధ్ర కేడర్కు తెచ్చుకున్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి Srilakshmi  జగన్ ప్రభుత్వంలో తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా పొందుతారు అంటూ ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమెకు రెండు నెలల్లోనే రెండు ప్రమోషన్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం కావాలనే ఆమె హోదా పెంచుతూ వెళ్తోందని, ఆమె సిఎస్ అయ్యేందుకు అవసరమైన అన్ని దారులను జగన్ క్లియర్ చేస్తున్నారంటూ ఇప్పుడు ఓ వర్గం ఆరోపణలు చేస్తోంది.

Sri lakshmi got promotions regulerly
Sri lakshmi got promotions regulerly

వరుసగా పదోన్నతులు

ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి కీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని తాత్కాలిక (అడ్‌హక్‌) పదోన్నతిగా ఉత్తర్వుల్లో పేర్కొంది. మూడు నెలల వ్యవధిలో రెండోసారి ప్రమోషన్ రావడంతో అధికారులను ఒక రకమైన అయోమయం నెలకొంది. ప్రభుత్వం ఆమెకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు వరుసగా పదోన్నతులు ఇస్తుండటంతో ఇది మరింత హాట్ టాపిక్ అయింది. ఆమె
సీఎస్ రేసులో ఉన్నారా అంటూ ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కేడర్ నుంచి ఏపీ కేడర్‌కు వచ్చిన తర్వాత.. మూడు నెలల వ్యవధిలో ఆమెకు ఇది రెండో ప్రమోషన్. 2021 జనవరి 18న ఆమెకు ముఖ్య కార్యదర్శిగా ప్రమోషన్ రాగా.. ఆమెపై పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల్లో తీర్పునకు లోబడి ఈ పదోన్నతి ఉంటుందని ప్రభుత్వం అప్పట్లో జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది.

జగన్ కావాలనే!

శ్రీలక్ష్మికి ప్రమోషన్ దక్కడంతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆమె సీఎస్ రేసులో ఉన్నారనే ప్రచారం మొదలైంది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీకాలం ఈ ఏడాది జూన్‌ 30 వరకూ ఉంది.. ఆయన రిటైరయ్యాక శ్రీలక్ష్మికి సీఎస్‌గా అవకాశం ఇస్తారా అని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. శ్రీలక్ష్మికి మరో ఐదేళ్లకు పైగా సర్వీసు ఉంది. 2026 జూన్‌ 30 వరకూ ఆమె సర్వీసులో ఉంటారు. ఏపీ సర్కార్ ఆ దిశగానే ప్రమోషన్ ఇచ్చిందనే చర్చ జరుగుతోంది.

** ఐఏఎస్ శ్రీలక్ష్మి తెలంగాణ కేడర్ నుంచి డిప్యుటేషన్‌పై ఏపీకి వచ్చే ప్రయత్నం చేశారు. కానీ డీవోపీటీ నిరాకరించడంతో ఆ తర్వాత తన స్దానికతను హైదరాబాద్‌గా చూపించకుని క్యాట్ ద్వారా ఐఏఎస్‌ శ్రీలక్ష్మి గతేడాది డిసెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం రిలీవ్‍ అయ్యారు. ఏపీలో శ్రీలక్ష్మీ జీఏడీలో రిపోర్టు చేశారు. తర్వాత ఆమెకు ఏపీ సచివాలయంలో పురపాలక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. అదే శాఖలో ఆమెకు ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పుడు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి దక్కింది.

 

author avatar
Comrade CHE

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju