న్యూస్ సినిమా

విమర్శకుల చెంప చెళ్లుమనిపించిన అల్లు అర్జున్.. దెబ్బకి నోళ్లు మూతపడ్డాయిగా!!

Share

అల్లు అర్జున్‌ను మెగా అభిమానులు తరచుగా ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఏ చిన్న సందు దొరికినా అతడిపై విరుచుకుపడటానికి వీరు ముందుంటారు. అయితే ఇప్పుడు బన్నీ కృష్ణంరాజు మరణంపై ట్వీట్ చేయలేదని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సెప్టెంబర్ 11న టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణంరాజు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన అంతిమ యాత్ర కొనసాగుతోంది. అంతకంటే ముందు అతని భౌతికకాయానికి మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్, చిరంజీవి వంటి పలువురు సినీ ప్రముఖులు అంజలి ఘటించారు. కృష్ణంరాజు కుటుంబాన్ని, ప్రభాస్‌ను ఓదార్చుతూ తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా కృష్ణంరాజు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

చెంప చెల్లుమనేలా సమాధానం

#Allu Arjun

అయితే అల్లు అర్జున్ కృష్ణంరాజు మరణించినా ఒక ట్వీట్ కూడా చేయలేదని, పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత అతనికి తలపొగరు బాగా పెరిగిపోయిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కూడా విషెష్ చెప్పలేదని.. ఇప్పుడు సంతాపం చేయాల్సిన కనీస బాధ్యతను కూడా అతడు మరిచిపోయాడని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వారందరినీ చెంప చెల్లుమనేలా అల్లు అర్జున్ ఒక పని చేశారు.

మూతపడిన నోళ్లు

Prabhas

మూవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టక ముందే ప్రభాస్, అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. కాకపోతే వారు ఎప్పుడూ ఈ స్నేహాన్ని బయట పెట్టరు. కానీ కృష్ణంరాజు మరణ వార్త విన్న తర్వాత దిగ్భ్రాంతికి గురైన అల్లు అర్జున్ వెంటనే హైదరాబాద్‌కు వెళ్లాడు. అలాగే తన మిత్రుడు ప్రభాస్ను కలుసుకొని అతన్ని ఓదార్చాడు. హైదరాబాద్‌లో దిగిన వెంటనే బన్నీ నేరుగా కృష్ణంరాజు భౌతిక కాయాన్ని సందర్శించి, చివరి నివాళులర్పించారు. అలా అల్లు అర్జున్ విమర్శకుల చెంప చెళ్లుమనిపించారు. ఆ దెబ్బకి ట్వీట్‌ చేయనందుకు బన్నీపై ఇష్టమొచ్చినట్టు నోరుపారేసుకున్న ఆ నోళ్లన్నీ మూతపడ్డాయి.


Share

Related posts

Epiphora: కంటి నుంచి నీరు కారకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి..!!

bharani jella

అమ్మో ఇవేమి దా”రుణాలు” : ఆన్ లైన్లో కాల్ మని కేటుగాళ్లు హైద్రాబాద్ ఘటనలో ఎన్నో నిజాలు

Comrade CHE

Nithiin: హీరో నితిన్‌కి ఈ రోజు వెరీ వెరీ స్పెష‌ల్‌.. ఎందుకో తెలుసా?

kavya N