Allu sirish : అల్లు శిరీష్..స్టార్ మేకర్ అల్లు అరవింద్ చిన్న కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి తమ్ముడు. అంతేకాదు పెద్ద మెగా ఫ్యామిలీ బ్యాక్ సపోర్ట్ ఉంది. అయినా అన్న అల్లు అర్జున్ మాదిరిగా సినిమాలు చక చకా చేయలేకోపోతున్నాడు. అంతేకాదు స్టార్ ఇమేజ్ పరంగా కూడా అల్లు అర్జున్ కి అల్లు శిరీష్ కి చాలా తేడా ఉంది. శిరీష్ నుంచి ఒక్కో సినిమాకి చాలా గ్యాప్ వస్తోంది. శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నాడు.

అనూ ఇమ్మానియేల్ అల్లు శిరీష్ కి జంటగా నటిస్తోంది. ఈ తాజా చిత్రం నుంచి వరుసగా రెండు రొమాంటిక్ పోస్టర్స్ రిలీజయ్యాయి. ప్రేక్షకుల్లో అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచాయి. ఈ పోస్టర్స్ చూస్తుంటే కంప్లీట్ రొమాంటిక్ లవ్ స్టోరిగా ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. దాదాపు ఈ సినిమా టాకీపార్ట్ కంప్లీట్ అయినట్టు సమాచారం. లాక్ డౌన్ గనక లేకపోయి ఉంటే ఈపాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్లాన్ చేసేవారు. కానీ భారీ బడ్జెట్ సినిమాలే ఆగిపోయాయి. ఇక మీడియం బడ్జెట్ సినిమాలను ఇలాంటి సమయంలో రిలీజ్ చేయాలన్నా పెద్ద రిస్కే.
Allu sirish : శిరీష్ కి కెరీర్ ప్రారంభంలో పెద్దగా సక్సెస్ లు రాని సంగతి తెలిసిందే.
అయితే శిరీష్ నుంచి ఇలా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా సినిమాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. శిరీష్ కి కెరీర్ ప్రారంభంలో పెద్దగా సక్సెస్ లు రాని సంగతి తెలిసిందే. శ్రీరస్తు శుభమస్తు సూపర్ హిట్ అవగా ఒక్క క్షణం మాత్రం కాస్త యావరేజ్‌గా నిలిచింది. సక్సెస్ లు కంటిన్యూ అయితే పెరిగే మార్కెట్..పాపులారిటీ వేరే. కానీ అది సాధ్యమవడం లేదు. చాలా గ్యాప్ తర్వాత ఓ రొమాంటిక్ సినిమాతో రాబోతున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు.