Anchor Suma movie: బుల్లితెరపై సక్సెస్ ఫుల్ యాంకర్‌గా కొనసాగుతున్న సుమ.. చాలా కాలం తర్వాత వెండి తెరకు రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆమె లీడ్ రోల్ ప్లే చేస్తున్న సినిమాకు సంబంధించిన పోస్టర్, ప్రోమో తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఆ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఆసక్తికరంగా ఫస్ట్ లుక్, పోస్టర్..
వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ విడుదల చేశారు. ఈ మూవీకి ‘జయమ్మ పంచాయితీ(Jayamma Panchayathi)’ అనే టైటిల్ పెట్టారు. టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ కూడా భిన్నంగా ఉంది. ఇటీవల సుమ తాను ఓ ఫీచర్ ఫిల్మ్‌లో నటిస్తున్నట్లు పేర్కొంది. అలా ఆమె పేర్కొన్నట్లుగానే సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి.
గ్రామ ఊరి పెద్ద పాత్రలో సుమ కనకాల..
విడుదలైన ప్రోమో, పోస్టర్‌ను బట్టి సినిమా చక్కటి గ్రామీణ వాతావరణంలో తెరకెక్కబోతున్నదని అర్థమవుతోంది. ఇందులో సుమ గ్రామ పెద్ద పాత్రను పోషించబోతుందని అంచనా వేయొచ్చు. 1996లో ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ అనే సినిమాలో హీరోయిన్గా నటించిన సినిమా ఆ తర్వాత పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. ఇప్పుడు లీడ్ రోల్ ప్లే చేస్తోంది. మొత్తానికి ‘జయమ్మ పంచాయితీ’ ఫస్ట్ లుక్, పోస్టర్ చూశాక.. సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చిత్రానికి విజయ్‌కుమార్ కలివరుపు డైరెక్టర్. కాగా, ఆయనే స్టోరి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి(MM Keeravani) సంగీతం అందిస్తుండగా, బలగ ప్రకాశ్ ప్రొడ్యూసర్. పోస్టర్లో సుమ మునుపెన్నడు లేని విధంగా సీరియస్ లుక్‌తో ఆకట్టుకుంటోంది. ప్రోమో, పోస్టర్‌ను చూసి సుమ యాంకర్‌గానే కాదు.. నటిగానూ ప్రేక్షకులను తప్పక అలరిస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!