Balakrishna: బాలయ్య బాబు వయసుతో సంబంధం లేకుండా భారీగా సినిమాలు ఒప్పుకుంటున్నారు. ఇటీవల ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో… కరోనా కారణంగా సినీ కార్మికులకు పని లేకుండా పోయిందని.. వాళ్లకి చేతినిండా డబ్బులు ఉండాలంటే హీరోలు భారీగా సినిమాలు చేయాలని తెలిపారు. తనకి నాలుగు నెలల్లో 3 సినిమాలు కంప్లీట్ చేసే సత్తా ఉందని.. కూడా సగర్వంగా తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో “అఖండ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కేవలం క్లైమాక్స్ ఒక సాంగు మినహా మిగతా అంతా కంప్లీట్ అయినట్లు బాలకృష్ణ ఇటీవల తెలిపారు.
పరిస్థితి ఇలా ఉంటే ఏ సినిమా తర్వాత అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని అదే రీతిలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాలు ఉన్నట్లు ఆ ఇంటర్వ్యూలో బాలయ్య బాబు క్లారిటీ ఇవ్వటం జరిగింది. వరుసగా మూడు కొర్ర దర్శకులను లైన్ లో పెట్టిన బాలయ్య బాబు తాజాగా మరో నాలుగో కుర్ర డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు… ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు వెంకీ కుడుముల. చలో సినిమాతో ఫస్ట్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల తర్వాత “భీష్మ” సినిమా తో మరో విజయం తన ఖాతాలో వేసుకోవడం జరిగింది.
ఇక మూడో సినిమా బాలయ్య బాబుతో చేయాలని ఇటీవల ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ బాలయ్య బాబుకు వినిపించడం జరిగింది అని.. ఫస్ట్ సిట్టింగ్ లోనే బాలయ్య బాబు ఓకే చేయడం జరిగిందని త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. మరోపక్క బాలయ్య బాబుతో సినిమాలు నిర్మించడానికి సి. కళ్యాణ్, దిల్ రాజు, రాజ్ కందుకూరి తో పాటు ఏక ఎంటర్టైన్మెంట్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ ఒంటి బ్యానర్లు రెడీగా ఉన్నట్లు వీటిలో ఒక బ్యానర్ లో ఈ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!