RRR: “RRR” లో ఎన్టీఆర్ క్యారెక్టర్ కొమరం భీమ్ అని క్లారిటీ ఇచ్చి ప్రారంభంలో ఎన్టీఆర్ ముస్లిం లుక్ పోస్టర్ సినిమా యూనిట్ రిలీజ్ చేయడం తెలిసిందే. దీంతో ఆడియన్స్ కన్ఫ్యూజన్ లో పడ్డారు. కొమరం భీమ్ అని చెప్పి ఎన్టీఆర్ కి ముస్లిం వేషధారణ వేయటం ఏంటి అన్న సందేహాలపై సోషల్ మీడియాలో ఎప్పటినుండో రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా స్టోరీ అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.
విషయంలోకి వెళితే స్టోరీ హైదరాబాద్ నగరం తో కొద్దిపాటి ముడిపడి ఉంటుందని అప్పట్లో నిజాం లు పరిపాలించేవారు కాబట్టి ఆ సమయంలో నిజాం పోలీసుల నుండి తప్పించుకోవటానికి కొమరం భీమ్… ముస్లిం పాత్ర మరియు సంప్రదాయ దుస్తులు ధరిస్తారని సినిమాలో జస్ట్ అది ఒక చిన్న సన్నివేశం దీనిపై వివాదాలు విమర్శలు చేసుకునే అంత విషయం ఏమీ లేదు అన్న తరహాలో క్లారిటీ ఇచ్చారు. ఇదే తరుణంలో చరణ్‌ను క్యారెక్టర్ చాలా బాగుంటుంది అని కూడా చెప్పుకొచ్చారు.
Read More: RRR: సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న..RRR.. రికార్డ్స్ వేట ఇంకా కొనసాగుతూనే ఉంది..??
ఇదిలా ఉంటే ఈ సినిమా అక్టోబర్ 13వ తారీకు రిలీజ్ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఆగస్టు ప్రారంభం నుండి స్టార్ట్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడంతో “RRR” పై దేశవ్యాప్తంగా మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో.. జరిగినట్లు ఇండస్ట్రీ టాక్. ఇదే తరహాలో ఇటీవల మేకింగ్ వీడియోకి భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో.. సినిమా యూనిట్ కూడా ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి పై సంతోషం వ్యక్తం చేస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!