Anushka Setty: అనుష్క కెరీర్ ఆగిపోలేదు..ప్రభాస్ బ్యానర్‌లో మళ్ళీ మొదలైంది..!

Share

Anushka Setty: సూపర్ సినిమాతో అనుష్క శెట్టిని టాలీవుడ్‌కు పరిచయం చేశాడు దర్శకుడు పూరి జగన్నాధ్. అక్కినేని నాగార్జున హీరోగా, సోనూసూద్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా మంచి హిట్ సాధించింది. దాంతో అనుష్క టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది. సూపర్ తర్వాత సినిమా ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవాలనుకున్న అనుష్క ఇక్కడ ప్రేక్షకుల ఆదరణ, సినిమా తర్వాత వచ్చే పాపులారిటీ చూసి కంటిన్యూ అయింది. చూస్తూండగానే 15 ఏళ్ళ ప్రయాణం ఇట్టే సాగిపోయింది. ఈ 15 ఏళ్ళలో ప్రభాస్ సరసన బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలు చేసింది.

anushka-setty-career is re started in prabhas banner
anushka-setty-career is re started in prabhas banner

నాగార్జునతో డాన్, ఢమరుకం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి లాంటి సినిమాలు చేసింది. గోపీచంద్, మహేశ్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, వెంకటెశ్, బాలకృష్ణ, సుమంత్.. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి మంచి హిట్స్ అందుకుంది. ఇక అనుష కెరీర్‌లో గొప్ప సినిమా అంటే అరుంధతి. ఈ సినిమా తర్వాత ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. వేదం లాంటి సినిమాలతో ప్రయోగం చేసి కూడా అనుష్క సత్తా చాటింది. దాంతో అనుష్క ప్రధాన పాత్రల్లో సినిమాలను రూపొందించేందుకు మేకర్ రెడీ అయ్యారు.

Anushka Setty: న్యూ ఏజ్ లవ్ స్టోరీగా అనుష్క సినిమా..!

ఇలా తెలుగులో మంచి కమర్షియల్ సినిమాలు చేస్తూనే తమిళంలో కూడా సూర్య నటించిన సింగం సిరీస్ చిత్రాలతో పాటు అజిత్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది. ఇలా సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిన అనుష్క మధ్యలో కొన్ని ఫ్లాప్ సినిమాలు చేయడంతో రేస్‌లో కాస్త వెనకబడింది. ముఖ్యంగా సైజ్ జీరో సినిమా అనుష్కకు బాగా మైనస్ అయింది. అసలే కెరీర్ చాలా నెమ్మదిగా సాగుతున్న సమయంలో నిశ్శబ్ధం లాంటి మరో ప్రయోగాత్మకమైన సినిమాలో నటించి ఫ్లాప్ అందుకుంది. పాన్ ఇండియన్ రేంజ్‌లో వచ్చిన ఈ సినిమా జనాలను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

ఆ తర్వాత మళ్ళీ అనుష్క కొత్త సినిమాలేవి ప్రకటించలేదు. దాంతో ఇక అనుష్క సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టిందని వార్తలు వచ్చాయి. అలాగే యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేయబోతుందనే వార్తలు వచ్చినా ఇన్నాళ్ళు దానికి సంబంధించిన కన్‌ఫర్మేషన్ రాలేదు. దాంతో ఇవి కేవలం రూమర్స్ మాత్రమే అనుకున్నారు. ఎట్టకేలకి ఆ రూమర్సే నిజమయ్యాయి. అనుష్క శెట్టి బర్త్ డే సందర్భంగా యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో అనుష్క శెట్టి తన హ్యాట్రిక్ మూవీని చేయబోతోంది. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా ఇది తెరకెక్కబోతోందని అఫీషియల్‌గా యూవీ వారు ప్రకటించారు.

Anushka Setty: అనుష్క కెరీర్ క్లోజ్ అనుకున్న వాళ్ళకి ఇది పెద్ద షాకే..

ఇక అనుష్క కెరీర్ క్లోజ్ అనుకున్న వాళ్ళకి ఇది పెద్ద షాకే అని చెప్పాలి. ఇప్పటికే యూవీ బ్యానర్‌లో అనుష్క మిర్చి, భాగమతి సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు మంచి సూపర్ హిట్ సాధించాయి. ఇక ఈ హ్యాట్రిక్ మూవీలో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించబోతున్నాడని సమాచారం. త్వరలో షూటింగ్ మొదలబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మిగతా వివరాలను చిత్రబృందం త్వరలో వెల్లడించనున్నది. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన రా రా కృష్ణయ్య సినిమా దర్శకుడు మహేశ్ బాబు ఈ మూవీకి దర్శకత్వం వహించబోతున్నాడు.


Share

Related posts

Nagarjuna Sagar Bypoll : సాగర్ లో బీజేపీకి షాక్!గులాబీ కండువా కప్పుకున్న సీనియర్ నాయకుడు!

Yandamuri

విభజన తీరు సమ్మతం కాదు

Siva Prasad

Samantha At Rana Daggubati-Miheeka Bajaj wedding pics

Gallery Desk