Siva: తమిళంలో హిట్ చిత్రాల దర్శకుడిగా ఈ మధ్యకాలంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు శివ. ఈయనకి మొదటిసారి అణ్ణాత్త సినిమా గట్టి షాకిచ్చింది. మలయాళం, తమిళం, తెలుగులో వచ్చిన సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన శివ మంచి టెక్నీషియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన 2008లో దర్శకుడిగా మారి శౌర్యం సినిమాను రూపొందించాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో శివకు టాలీవుడ్లో దర్శకుడిగానూ మంచి పేరొచ్చింది. మాస్ సినిమాలను బాగా డీల్ చేస్తాడని పలువురు ప్రశంసించారు.
ఇక ఈ సినిమా తర్వాత 2009లో శంఖం సినిమాను తెరకెక్కించి మరో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. కార్తి హీరోగా సిరుతై చిత్రాన్ని తెరకెక్కించి మంచి హిట్ అందుకున్నాడు. తెలుగులో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమానే తమిళలో కార్తీతో తీసి హిట్ అందుకున్నాడు. తమిళంలో కూడా దర్శకుడిగా మంచి పేరు వచ్చింది. మళ్ళీ తెలుగుకు వచ్చి రవితేజతో దరువు అనే సినిమా తీశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్ సినిమాగా నిలిచింది.
Siva: ఇదే సినిమా తెలుగులో మెగాస్టార్ భోళా శంకర్‌గా రీమేక్ చేస్తున్నారు.
దాంతో ఇక తెలుగులో శివ మళ్ళీ కనిపించలేదు. తమిళంలో అజిత్ కుమార్ హీరోగా వరుసగా సూపర్ హిట్ సినిమాలను ఇచ్చాడు. అజిత్ – శివ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా వీరం. ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అజిత్‌కు వేదాళం కథ చెప్పి ఇంప్రేస్ చేశాడు. అలా వీరి కాంబినేషన్లో రెండవ సినిమాగా వేదాళం వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఇదే సినిమా తెలుగులో మెగాస్టార్ భోళా శంకర్‌గా రీమేక్ చేస్తున్నారు. మెహర్ రమేశ్ దర్శకుడు.
ఇక అజిత్ – శివ కాంబినేషన్లో వచ్చిన మూడవ సినిమా వివేగం. ఈ సినిమా కూడా మంచి మాస్ ఎంటర్టైనర్గా వచ్చి భారి హిట్ సాధించింది. అజిత్ – శివ కాంబినేషన్ అంటే కోలీవుడ్‌లో సూపర్ హిట్ కాంబినేషన్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఈ క్రమంలోనే వీరిద్దరు కలిసి విశ్వాసం సినిమా చేసి మరో మాస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇలా వరుసగా అజిత్ – శివ కలిసి నాలుగు సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. దాంతో రజనీకాంత్ శివకు దర్శకుడిగా అవాశం ఇచ్చారు. అణ్ణాత్త పేరుతో వచ్చిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు పెద్దన్నగా అందించారు.
Siva: ఇదే నిజమైతే ఈసారైనా రజనీ కోరుకుంటున్న హిట్ శివ ఇస్తాడేమో.
కానీ ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న శివకు అణ్ణాత్తతో ఫస్ట్ ఫ్లాప్ పడి షాక్ ఇచ్చింది. కబాలి నుంచి దర్బార్ వరకు వరుస ఫ్లాప్స్ చూసిన రజనీకాంత్ ఎంతో నమ్మకం పెట్టుకొని ఈ సినిమా చేస్తే హిట్ దక్కలేదు. అయినా మరోసారి శివ దర్శకత్వంలో రజనీకాంత్ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అణ్ణాత్త షూటింగ్ సమయంలోనే మరో కథ రజనీకి చెప్పాడట శివ. ఈ కథ బాగా నచ్చి నెక్స్ట్ సినిమాగా ఇదే చేద్దామని చెప్పినట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో. ఒకవేళ ఇదే నిజమైతే ఈసారైనా రజనీ కోరుకుంటున్న హిట్ శివ ఇస్తాడేమో.