NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: నేటి వాలంటీర్లు రాబోయే రోజుల్లో నేతలు – జగన్

CM YS Jagan: నేటి వాలంటీర్లు రాబోయే రోజుల్లో లీడర్లు (నాయకులు) కాబోతున్నారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఫిరంగిపురం మండలం రేవూడిలో వాలంటీర్ల అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు తన సైన్యంగా జగన్ అభివర్ణించారు. 58 నెలలు అలసి పోకుండా ప్రజలకు సేవ చేశామని చెప్పారు.

లంచం లేని వ్యవస్థ ను అందించడమే వాలంటీర్ల నియామకం అని జగన్ తెలిపారు. లంచాలు, వివక్ష వ్యవస్థను వాలంటీర్లు బద్దలు కొట్టారన్నారు. మీ నిజాయితీని గుర్తిస్తూ నాలుగేళ్లుగా బహుమతులు ఇస్తున్నామన్నారు. 875 మందికి సేవా వజ్ర, 4,150 మందికి సేవా రత్న, 2,50,439 మందికి సేవా మిత్ర అవార్డులను ప్రధానం చేశారు. సేవా వజ్రాలకు రూ.30వేల నుండి రూ.45వేలు, సేవా రత్నలకు రూ.20వేల నుండి రూ.30వేలు, సేవా మిత్రలకు రూ.10వేల నుండి 15వేలకు పెంపు చేసి బహుమతులు అందించామన్నారు.

మన పథకాలకు వాలంటీర్లు బ్రాడ్ అంబాసిడర్లు అని పేర్కొన్నారు. చంద్రబాబు హాయంలో జన్మభూమి కమిటీలు గంజాయి మొక్క అయితే మన సచివాలయ వ్యవస్థ తులసి మొక్క అని అన్నారు. చంద్రబాబు పాలన విషవృక్షం, మన పాలన కల్పవృక్షం అని అన్నారు. గతంలో జన్మభూమి కమిటీల అరాచకాల వల్ల జనం నష్టపోయారని, టీడీపీని అధికారంలో నుండి దించడానికి ప్రధాన కారణం జన్మభూమి కమిటీలేనని అన్నారు. 2024లో తిరిగి వైసీపీ అధికారంలోకి రావడానికి కారణం వాలంటీర్ల వ్యవస్థ అని అయన అన్నారు.

వాలంటీర్ల వ్యవస్థ గ్రామాల రూపు రేఖలనే మార్చాయని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను అందిస్తున్నామంటే అది వాలంటీర్ల వ్యవస్థ గొప్పతనమని అన్నారు. లబ్దిదారుల ఎంపికలోనూ వాలంటీర్ల వ్యవస్థ అమోఘమని, ఎలాంటి వివక్షకు తావు లేకుండా ఎంపిక చేసి అందరి మన్ననలను అందుకున్నారని ఆయన తెలిపారు. మరో రెండు నెలల్లో యుద్ధానికి సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు.

మనం చేసిన మంచిని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని అన్నారు. గత పాలవనకు, మన పాలనకు మధ్య తేడాను ప్రజలకు వివరించాలని కోరారు. గత పాలనలో స్కీమ్ లు లేవు, బటన్ లు లేవు, మంచి చేయాలన్న తపన చంద్రబాబుకు లేదని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని కోరారు. మంచి పౌర సేవలను అందించాలంటే వాలంటీర్ల వ్యవస్థ అవసరమని జగన్ అన్నారు. గౌరవ వేతనంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి చేర్చిన వాలంటీర్లకు తన సెల్యూట్ అని జగన్ అన్నారు.

TDP: టీడీపీకి కేంద్ర మాజీ మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాజీనామా .. బీజేపీతో కలవడంపై చంద్రబాబుకు ఘాటుగా లేఖ

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju