NTR: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన చిత్రం ‘వార్ 2’. గతంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన ‘వార్’ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ విలన్ పాత్ర చేస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. “వార్ 2” సినిమా ఫస్ట్ షెడ్యుల్ స్పెయిన్‌లో చిత్రీకరించినట్లు ఇటీవల అప్డేట్ కూడా రావడం జరిగింది. ఈ క్రమంలో స్పెయిన్‌లో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాల ఫోటోలు సోషల్ మీడియాలో కూడా రావడం జరిగాయి. అయితే, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ చిత్రీకరిస్తున్న ‘వార్ 2’ షూటింగ్ చేస్తున్న టైంలో ప్రధాన నటుడు హృతిక్ రోషన్ కాలికి గాయం కావడం జరిగింది. ఈ ఘటన తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌ల ద్వారా వెల్లడి చేయడం జరిగింది.
ఎన్టీఆర్ సినిమాలలో వరుసగా ప్రధాన నటులు గాయలు కావడం అందరికి షాక్ కి గురి చేస్తోంది. దీంతో హృతిక్ రోషన్ బెల్ట్ పట్టుకుని కర్రతో నిలబడి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. దీంతో ఎన్టీఆర్ సినిమాలో వర్క్ చేస్తున్నవరికే ఇలా ఎందుకు జరుగుతోందని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ‘వార్ 2’ హృతిక్ రోషన్ గాయం కారణంగా ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్ లో గూఢచారి నేపధ్యంలో నిర్మించే అన్ని సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ విలన్‌గా కనిపిస్తాడని టాక్ నడుస్తోంది. అలాగే తారక్ పాత్రను స్టాండ్‌లోన్ సినిమాగా మార్చే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ దేవర సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ కి కూడా ఇటీవల ప్రమాదవశాత్తు ఎడమ చేయి ఫ్రాక్చర్ అయింది. ఈ రకంగా ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకునే బాలీవుడ్ హీరోలు వరుసగా గాయాలు పాలు కావడం సంచలనంగా మారింది.