NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: అమరావతి రైతుల బహిరంగ సభకు అనుమతి ఇచ్చిన ఏపి హైకోర్టు..!!

AP High Court: చిత్తూరు జిల్లా తిరుపతిలో ఈ నెల 17వ తేదీన అమరావతి రైతుల బహిరంగ సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 1 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సభ నిర్వహించుకోవాలని ఆదేశించింది. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ సభ జరుపుకోవాలనీ, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ప్రభుత్వ అధికారులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు న్యాయస్థానం నుండి దేవస్థానం పేరుతో అమరావతి నుండి తిరుపతికి మహాపాదయాత్ర చేశారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 17వ తేదీ తిరుపతిలో బహిరంగ సభ నిర్వహణకు అమరావతి జేఏసి నేతలు పోలీసులను అనుమతి కోరగా బహిరంగ సభకు అనుమతి ఇవ్వలేదు. దీంతో అమరావతి జేఏసి నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి జేఏసి నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం సభకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ల తరపు న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణలు ధర్మాసనాన్ని కోరారు.

AP High Court grants permission for Amaravati farmers meeting
AP High Court grants permission for Amaravati farmers meeting

 

AP High Court: బహిరంగ సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి

అయితే ప్రభుత్వ తరపు న్యాయవాది సుధాకరరెడ్డి బహిరంగ సభ నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సభకు అనుమతి ఇవ్వడం వల్ల రెండు ప్రాంతాల మధ్య ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని కోర్టుకు వివరించారు. పాదయాత్ర సమయంలో పోలీసులపై అమరావతి రైతులు దాడి చేశారని పేర్కొంటూ వీడియో పుటేజ్ ను ధర్మాసనానికి చూపారు. అదే విధంగా ఒమైక్రాన్ కేసుల ఉన్న నేపథ్యంలో సభకు అనుమతి ఇవ్వవద్దని, అదే విదంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయని కోర్టుకు వివరించారు. ప్రవేటు ప్రదేశాల్లో సభను నిర్వహించుకుంటే తప్పేమిటని హైకోర్టు ప్రశ్నించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం బహిరంగ సభకు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. బహిరంగ సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే క్రమంలో రాయలసీమ ఐక్య వేదిక సభను మర్నాడు నిర్వహించుకోవాలని హైకోర్టు సూచించింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N