Anasuya: అనసూయ కోసం కొత్త పాత్రలు పుడుతున్నాయి..వాళ్ళు వద్దందుకేనా..?

Share

Anasuya: టాలీవుడ్‌లో ఇప్పుడు యాంకర్ కమ్ నటి అనసూయకి విపరీతమైన క్రేజ్ ఉంది. బుల్లితెరపై సందడి చేస్తున్న అనసూయ అలాగే సినిమాలలో కూడా సత్తా చాటుతూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. మామూలుగా అయితే బుల్లితెరమీద పాపులర్ అయిన వాళ్ళను సినిమాలలో తీసుకోరనే అపవాదు ఒకటుంది. కొందరి విషయాలలో ఇది వాస్తవం కూడా. గతంలో బుల్లితెర మీద నటించే వారిని సినిమాలో తీసుకుంటే ప్రేక్షకులను సినిమా చూసిన ఫీలింగ్ కలగదని టాక్ ఉండేది.

are new roles created for anasuya...?
are new roles created for anasuya…?

అందుకే సీరియల్స్‌లో నటిస్తూ బాగా పేరు తెచ్చుకున్న యువతను కూడా తీసుకునేవారు కాదు. యాంకర్స్ కూడా సినిమాలలో మైక్ పట్టుకొని రెండు మూడు నిముషాలు మాత్రమే కనిపించేవారు తప్ప మంచి రోల్ చేసిన వారు చాలా తక్కువ. అనితా చౌదరి, ఝాన్సీ లాంటి వారు సినిమాలలో అవకాశాలు అందుకొని బాగానే రాణించారు. ఇక ఇప్పుడు రష్మీ, శ్రీముఖి, అనసూయ నెమ్మదిగా యాంకరింగ్ చేస్తూ సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నారు. అయితే ఈ ముగ్గురులో కూడా హీరోయిన్‌గా నటించిన రష్మీ కంటే అనసూయ బాగా పేరు తెచ్చుకుంది.

Anasuya: అనసూయ హీరోయిన్ అవకాశాల కోసం చూడకుండా..?

రష్మీకి హీరోయిన్‌గా మాత్రమే అవకాశాలు వచ్చాయి. వాటిలో కూడా సక్సెస్ అయింది తక్కువే. కానీ అనసూయ హీరోయిన్ అవకాశాల కోసం చూడకుండా చక్కటి నటనకి ఆస్కారం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ రాణిస్తోంది. బుల్లితెర మీద సందడి చేస్తూ ఎంత బిజీగా ఉన్నా కూడా అనసూయ కోసం ప్రత్యేకంగా సినిమాలలో కొత్త తరహా పాత్రలు తయారవుతున్నాయి. క్షణం సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా, సోగ్గాడే చిన్ని నాయనలో నాగార్జున మరదలిగా నటించి ఆకట్టుకున్న అనసూయ ఆ తర్వాత వీపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది మాత్రం రాం చరణ్ – సమంత నటించిన రంగస్థలం సినిమాతో.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా చరణ్, సమంతలకి ఎంతగా పేరు తెచ్చిందో అనసూయకి అంతే పేరు తెచ్చింది. ఈ పాత్ర అనసూయకి దక్కడానికి కారణం మాత్రం సీనియర్ హీరోయిన్ రాశి అని చెప్పాలి. ఈ క్యారెక్టర్ ముందు ఆమెకి ఆఫర్ చేశారు. అయితే పాత్ర కాస్త బోల్డ్‌గా ఉంటుందనే కారణంతో రాశి రిజెక్ట్ చేసిది. అక్కడే అనసూయకి లక్ వీర లెవల్‌లో ఫేవర్ చేసింది. రాశి రిజెక్ట్ చేసిన క్యారెక్టర్ అనసూయకి దక్కి దశ దిశ తిరిగిపోయింది. ఈ సినిమా తర్వాత అనసూయకి ప్రత్యేకంగా రచయితలు పాత్రలు రాస్తున్నారు.

Anasuya: అనసూయ అద్భుతమైన అవకాశాలు అందుకుంటూ ఊహించని క్రే్‌జ్ తో కొనసాగుతోంది.

ప్రస్తుతం అనసూయ మరోసారి సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా పుష్పలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో ఆమె సునీల్‌కి భార్యగా కనిపిస్తుందట. అలాగే మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమాలో ముఖ్య పాత్రలో కనిపంచబోతోంది. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఎంతో ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తున్న రంగ మార్తాండ సినిమాలో కూడా గొప్ప పాత్ర పోషిస్తుంది. ఈ పాత్ర కూడా అనసూయ కెరీర్‌లో మైల్ స్టోన్‌గా మిగులుతుందని చెప్పుకుంటున్నారు. ఈ రకంగా అనసూయ అద్భుతమైన అవకాశాలు అందుకుంటూ ఊహించని క్రే్‌జ్ తో కొనసాగుతోంది. అంతేకాదు బుల్లితెర మీద కనిపించేవారికి సినిమా అవకాశాలు ఇవ్వరు అనే విషయం కూడా తప్పని ప్రూవ్ చేసింది.


Share

Related posts

రాహుల్ సిప్లిగంజ్ తో ఎఫైర్ అంటూ వచ్చిన కామెంట్లపై స్పందించిన అషురెడ్డి..!!

sekhar

జనసేన దెబ్బ ఎవరికి పడిందో!

somaraju sharma

బ్రేకింగ్: కరోనా భయంతో నశించిపోతున్న మానవతావిలువలు.. అంత్యక్రియలు నిర్వహించవద్దంటూ ఏలూరులో స్థానికుల అడ్డగింపు

Vihari