Maruthi: మారుతీ మీద ఇంకా ఆ సినిమాల ప్రభావం పోలేదా..?

Share

Maruthi: దర్శకుడుగా మారుతి మంచి ఫాంలో ఉన్నాడు. ఆయన తెరకెక్కిస్తున్న సినిమాలు ఇప్పుడు అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు సీనియర్ స్టార్ హీరోలు కూడా మారుతి దర్శకత్వంలో సినిమా చేసేందుకు బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. మారుతి కెరీర్ ప్రారంభంలో కొన్ని యూత్ రొమాంటిక్ సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. ఈ రోజుల్లో, బస్‌స్టాప్ అంటూ కేవలం యూత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసుకొని 5డి కెమెరాతో సినిమాలు తీసి ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ అయ్యాడు. ఆ సినిమాల ప్రభావం మారుతి మీద ఇంకా అలాగే ఉందనే కామెంట్స్ మళ్లీ ఇప్పుడు వినిపిస్తున్నాయి.

Aren't those movies still influencing Maruti ..?
Aren’t those movies still influencing Maruti ..?

మారుతి తీసిన ఈ రోజుల్లో, బస్‌స్టాప్ సినిమాలలో కొన్ని బోల్డ్ సీన్స్ చూపించే ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడని ప్రచారం చేశారు. అంతేకాదు సినిమా మొత్తం చెత్త చెప్పి క్లైమాక్స్‌లో మాత్రం నీతి కథలు చెప్పి హిత బోధ చేస్తున్నాడని కొందరు మారుతి మీద నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయినా కూడా మారుతి ఇవన్నీ పట్టించుకోకుండా తనపాటికి తను కథలు రాసుకుంటూ, సినిమాలు తీసుకుంటూ వస్తున్నాడు.నెమ్మదిగా సినిమాల విషయంలో పంథా మార్చుకొని ఏ ఆడియన్స్ అయితే మారుతిని కామెంట్స్ చేశారో, ఆ ఆడియన్స్‌తోనే మంచి టాక్ వచ్చేలా సినిమాలను తీసి హిట్ కొట్టాడు.

Maruthi: ఓ పెద్ద హీరోను డైరెక్ట్ చేశాడనే పేరు తెచ్చుకున్నాడు.

ప్రేమకథ చిత్రం, రొమాన్స్, లవర్స్, లవ్ యూ బంగారం, గ్రీన్ సిగ్నల్ వంటి సినిమాలకి కథ అందించడంతో పాటు నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించి కూడా సత్తా చాటాడు. అయితే ఈ సినిమాలకి కొన్నీ సీన్స్ మారుతి డైరెక్ట్ చేసి వేరే వారి పేరు వేశాడని చెప్పుకున్నారు. ఏదేమైనా అటు దర్శకుడిగా, ఇటు నిర్మాతగా మారుతి ఒక స్థాయికి చేరుకున్నాడు. అదే సమయంలో అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా కొత్త జంట అనే సినిమాను తీసి మంచి హిట్ ఇచ్చాడు. ఈ సినిమా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చి లాభాలు తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత నాని, లావణ్య త్రిపాఠిలతో భలే భలే మగాడివోయ్ సినిమా తీసి ఫ్యామిలీ ఆడియన్స్‌లో దర్శకుడిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీ వర్గాలలో కూడా మారుతికి మంచి క్రేజ్ వచ్చింది. దాంతో వెంకటేశ్ హీరోగా బాబు బంగారం సినిమాను తీసే అవకాశం అందుకున్నాడు. ఈ సినిమా ఫ్లాపయినా కూడా ఓ పెద్ద హీరోను డైరెక్ట్ చేశాడనే పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మహానుభావుడు, శైలజా రెడ్డి అల్లుడు సినిమా రూపొందించాడు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. వీటి తర్వాత సాయి ధరం తేజ్, రాశిఖన్నా జంటగా ప్రతీ రోజూ పండగే సినిమా తీసి హిట్ ఇచ్చాడు.

Maruthi: త్రీరోజెస్ మారుతికి ఎలాంటి పేరు తీసుకు వస్తుందో.

ప్రస్తుతం గోపీచంద్, రాశి ఖన్నాలతో పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తునాడు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది. దాంతో త్రీరోజెస్ అంటూ తెలుగు ఓటీటీ ఆహా కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఇది ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయింది. త్వరలో స్ట్రీమింగ్‌కి రెడీ అవుతోంది. అయితే మరోసారి తన మార్క్ బోల్డ్ కంటెంట్‌తోనే దీనిని రూపొందించినట్టు టాక్ వినిపిస్తోంది. అంటే ఇంకా మారుతీ మీద కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఇమేజ్ పోలేదని అర్థమవుతోంది. చూడాలి మరి త్రీరోజెస్ మారుతికి ఎలాంటి పేరు తీసుకు వస్తుందో.


Share

Related posts

బ్రేకింగ్ : టిడిపి కీలక నేత వైసిపిలోకి !

Yandamuri

Anchor Syamala : ఫ్యామిలీతో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న యాంకర్ శ్యామల

Varun G

Etela Rajendar: ఆ నివేదిక చెల్లదు.. ఈటెల వ్యహహారంలో హైకోర్టు ఇచ్చిన మలుపుతో కేసీఆర్ కి షాక్..!!

Yandamuri