NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP High Court: ఏపి సర్కార్‌కు బిగ్ షాక్ ఇచ్చిన హైకోర్టు…

AP High Court: అసలే ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడుతున్న ఏపి ప్రభుత్వానికి హైకోర్టు నుండి ఊహించని షాక్ ఎదురైంది. ఏపి సర్కార్ కు హైకోర్టు నుండి తరచు వ్యతిరేక తీర్పులు రావడం సర్వసాధారణమైపోయింది. పలు ప్రభుత్వ నిర్ణయాలను హైకోర్టు తప్పుబడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వాటిపై సమీక్ష జరుపుకుని అటువంటి పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కొందరు ఉన్నత స్థాయి అధికారులు న్యాయ సలహాలు పాటించకుండా ముందడులు వేయడం వల్ల ప్రభుత్వం బ్లేమ్ అవుతోంది. అధికారులు చేసిన తప్పిదాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తోంది. ఇటీవల ఎయిడెడ్ కళాశాలల విషయంలో ప్రభుత్వం నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబడుతూ మద్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులపై హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.

AP High Court key verdict on nregs works
AP High Court key verdict on nregs works

Read More: Badvel Bypoll: వైసీపీ – బీజేపీ దోస్తాన్ ఉందా? లేదా..? తేల్చనున్న మోడీ..!!

AP High Court:  ఉపాధి హామీ పనుల చెల్లింపులపై హైకోర్టు కీలక తీర్పు

విషయంలోకి వెళితే.. కేంద్ర నిధులతో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులకు సంబంధించి టీడీపీ ప్రభుత్వహయాంలో జరిగిన పనులకు బిల్లులు చెల్లించకుండా జగన్ సర్కార్ జాప్యం చేస్తూ వచ్చింది. సర్పంచ్ ల సంఘ గౌరవాధ్యక్షుడుగా యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ ఉపాధి హామీ బిల్లులపై పోరాటం సాగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞాపనలు పంపినా, నిరసన కార్యక్రమాలను నిర్వహించినా పెండింగ్ బిల్లులను చెల్లించలేదు. ఈ నేపథ్యంలో బాబూ రాజేంద్ర ప్రసాద్ సహా దాదాపు 1013 మంది హైకోర్టులో పిటిషన్ లు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లను కలిపి విచారించిన హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

Read More: MAA Elections: ఇంత అసహ్యంగా ఎన్నికలా అంటూ ప్రకాశ్ రాజ్ ఆవేదన..! ఎన్నికల అధికారికి ఫిర్యాదు..! ఏమిజరిగింది అంటే…?

నాలుగు వారాల్లోగా పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిందే

ఉపాధి హామీ పనులు చేసిన వారికి తక్షణమే బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే ఈ బిల్లుల చెల్లింపు ముగియాలని కూడా స్పష్టంగా చెప్పింది. అయితే ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున బిల్లులకు 20 శాతం మేర తగ్గించి చెల్లించడానికి అనుమతించాలని ప్రభుత్వ తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసి పుచ్చింది. అంతే కాకుండా పెండింగ్ బిల్లులను ఏడాదికి 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలని సంచలన తీర్పు చెప్పింది. హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయకుంటే కోర్టు దిక్కరణ చర్యలకు వెనుకాడబోమని హైకోర్టు తెలిపింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju