ఇండియాలో అతి పెద్ద ఎంటర్టైనింగ్ రియాలిటీ షోస్ లో ‘బిగ్ బాస్’. హిందీతో పాటు తమిళంలోను ఈ రియాలిటీ షో కి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ రియాలిటీ షోని అన్ని భాషల్లోను గ్రాండ్ గా నిర్వహిస్తున్నాఉ. ఇప్పటికే 3 సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ కి తెలుగు ప్రేక్షకుల్లోను విపరీతమైన పాపులారిటి వచ్చింది. కొత్త సీజన్ మొదలవబోతున్న ప్రతీసారి ప్రేక్షకుల్లో ఎంతో ఆతృత నెలకొంటుంది.
ప్రతీ సీజన్ కి ఎన్నో వివాదాలు చుట్టుకుంటున్నప్పటికి నిర్వాహకులు మాత్రం బిగ్ బాస్ సీజన్ ని కొనసాగిస్తున్నారు. ప్రేక్షకులు ఇచ్చే ఓటింగ్ ఆధారంగా విజేతను నిర్ణయించే ఈ షోలో ‘బిగ్ బాస్’ మొదటి సీజన్ లో హీరో శివబాలాజీ విన్నర్ గా నిలిచారు. సీజన్ 2లో యాక్టర్ కౌశల్ మండా సీజన్ 3లలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ టైటిల్ గెలుపొందిన సంగతి తెలిసిందే.
ఇక త్వరలో మొదలవబోయో సీజన్ 4 లో ఇండస్ట్రీతో పాటు బుల్లితెర మీద పాపులారిటీని సాధించిన చాలా మంది ప్రముఖులను పార్టిసిపేట్ చేయించడానికి ‘స్టార్ మా’ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ లో పాల్గొనే వారు వీరేనంటూ చాలా మంది సెలబ్రిటీస్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ షో ని నిర్వహించాలని స్టార్ మా బృందం సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సీజన్ 4 కి హోస్ట్ నాగార్జున అని అధికారకంగా వెల్లడించారు. అంతేకాదు తాజాగా ప్రోమో ని రిలీజ్ చేశారు.
అయితే షో అనుకున్న సమయానికి ప్రారంభం కాకపోవచ్చన్న టాక్ వినిపిస్తుంది. అందుకు కారణం ఈ షోలో పాల్గొనే కన్టెస్టెంట్స్ అని తెలుస్తుంది. ముందు అనుకున్నట్టుగా ఈ నెలాఖరున షో మొదలు కావాల్సింది. కాని కంటెస్టెంట్స్ అందరూ ఫైనల్ కాలేదని తెలుస్తుంది. అందుకే బ్రేక్ పడబతోందని అంటున్నారు. కంటెస్టెంట్స్ అందరూ ఫైనల్ అయి షో మొదలవడానికి సెప్టెంబర్ రెండవ వారం అవుతుందని సమాచారం.
https://www.youtube.com/watch?v=-WtzSLYfM2U
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!