NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బెజ‌వాడ ఎంపీ, మైల‌వ‌రంలో వైసీపీ క్యాండెట్లు అవుట్‌… !

ఏపీ అధికార పార్టీ వైసీపీలో నాయ‌కుల పేర్ల‌ను ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 7 జాబితాలు విడుద‌ల చేశా రు. మార్చిన వారిని మ‌ళ్లీ మ‌ళ్లీ మార్చి.. మ‌రీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లుగా నియ‌మించారు. దీంతో ఒక అంకం ముగిసింద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక‌, త‌మ‌కు తిరుగులేద‌ని అనుకున్న నాయ‌కుల‌కు.. తాడేప‌ల్లి నుంచి అనూహ్యమైన సంకేతాలు వ‌చ్చాయి. మీరు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లే! అంటూ.. స‌మాచారం అందింది. దీంతో జాబితాల్లో ఉన్న‌వారు… బేజారైపోతున్నారు.

వైసీపీలో ఇప్ప‌టి వ‌ర‌కు జాబితాలు ప్రకటించినా.. సుమారు 70 స్థానాల్లో అభ్య‌ర్థుల‌కు అవ‌కాశం ఇచ్చినా.. వారికి టిక్కెట్ కన్ఫర్మ్ అని చెప్పడం లేదు. వారి స్థానాల్లోనూ రోజుకో పేరు తెరపైకి వస్తోంది. మైలవరం నుంచి తిరుపతిరావు యాద‌వ్ ను ఇంచార్జ్ గా ప్రకటించారు. కానీ తాజాగా, ఇక్క‌డ మ‌రో పేరు వినిపిస్తోంది. విజయవాడ ఎంపీ విష‌యంలోనూ పార్టీ త‌ర్జ‌న బ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇలా అనేక స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు టెన్షన్ కు గురవుతున్నారు.

ఈ ప‌రిణామాలు.. ప్ర‌చారంపై ప్ర‌భావం చూపిస్తున్నాయి. `ఊరికి ముందే.. తీసుకువ‌చ్చి. ఇక్క‌డ ప‌డేశారు. కానీ, ఏదీ క్లారిటీ లేదు. ప్ర‌చారానికి క‌ద‌లాలంటే.. రోజుకు 5 ల‌క్ష‌లు అవుతోంది. పోనీ.. ఖర్చు చేసి ప్ర‌చారం చేస్తామా.. లాస్ట్‌లో ఏం ట్విస్టు ఇస్తారో తెలియ‌దు` అంటూ.. నాయ‌కులు ప‌లువురు ఇదే బాధను వ్య‌క్త ప‌రుస్తున్నారు. చివరికి క్షణంలో పేర్లు మార్చేస్తారా అని ఆందోళనకు గురవుతున్నారు. ఇంత జ‌రుగుతున్నా.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు బెంబేలెత్తుతున్నా.. ఖచ్చితంగా మీరే అభ్యర్థి అని వైసీపీ హైకమాండ్ ఎవరికీ చెప్పడం లేదు.

వైసీపీ అధినేత సీఎం జగన్ ఏడు జాబితాలను రిలీజ్ చేశారు. వారే అభ్యర్థులు అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ, సీఎం జగన్ రిలీజ్ చేస్తోంది అభ్యర్థుల జాబితా కాదు.. కేవలం సమన్వయకర్తల జాబితా మాత్రమేన‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రోవైపు.. మార్పు చేర్పుల్లో సీట్లు కోల్పోయిన వారు.. సీట్ల మార్పిడికి గురైన అసంతృప్త నేత‌లు `ఇవి సమన్వయకర్తల నియామకం మాత్రమే` అని తేల్చి చెబుతున్నారు. రెండు నెలల్లో ఏమైనా జరగొచ్చ‌ని.. బీఫాం త‌మ‌కే తప్పక వస్తుందని దీమాగా ఉన్నారు. దీంతో లిస్టులో పేరు ఉన్న వారు కూడా లాస్ట్‌లో ఏం జ‌రుగుతుందోన‌నే బెంగ‌తో కాలు బ‌య‌ట‌కు పెట్ట‌డం లేదు.

Related posts

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?