మాంసాహారాన్ని వండడానికి ఇదే బెస్ట్ పద్ధతి

ఈ మధ్య కాలాంలో చాలా మంది మట్టి పాత్రలలో వంటలు చెయ్యడానికి మక్కువ చూపుతున్నారు. మట్టి పాత్రలలో వంట చెయ్యడం అనేది మన పూర్వీకుల నుంచి మనకి వస్తున్న అలవాటు. మట్టిపాత్రల్లో వంట చెయ్యడం వల్ల లాభాలు, వాటిని ఎలా వాడాలి, ఎలా శుభ్రపరచాలి ఇవి చాలా మందికి తెలియక వీటిని వాడటానికి వెనకడుగు వేస్తున్నారు.
మాంసాహారాన్ని వండడానికి ఇదే బెస్ట్ పద్ధతిమట్టికుండలు వేడినీ, తేమనీ సమానంగా  మన ఆహారానికి అందజేస్తాయి. మట్టి పాత్రలలో తప్ప మరిఇంకే ఇతర వంట పాత్రలలోను మనకి ఈ గుణం కనిపించదు. వీటిల్లో వండిన ఆహారంలో పోషకాలు పోకుండా అలానే ఉంటాయి. మట్టి కుండలలో వండిన మాంసాహారం చాలా మృదువుగా ఉంటుంది.

మట్టి పాత్రలను వంటకు వాడటం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. మట్టి పాత్రల్లో వండిన భోజనం చాలా రుచికరంగా ఉంటుంది. ఇలా మట్టికుండల్లో వండిన ఆహారంలో ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఎన్నో ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. మట్టి కుండల్లో వంట చేయడం వలన మన ఆహారంలో ఉండవలసిన పోషకాలు అందులోనే ఉంటాయి.

మట్టి కుండల్లో వండే ఆహారంలో నూనె శాతం చాలా తక్కువుగా అవసరం ఉంటుంది. మన పూర్వికులు ఈ ఆహారాన్ని చాలా బలమైన ఆహరంగా చెప్తారు. మట్టి కుండల్లో పెరుగు చాలా చిక్కగా మంచి రుచితో ఉంటుంది. రంధ్రాలున్న మట్టి కుండలో ఆహారాన్ని వండటం వల్ల ఉష్ణోగ్రత మరియు ఆవిరి అన్ని వైపులా వెల్లి ఆహరం చాలా రుచికరంగా  అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మాంసాహారాన్ని మట్టికుండలో వండడం వల్ల ఆహరం ఎంతో రుచిగాను మరియు మెత్తగానూ వుంటుంది.