NewsOrbit
న్యూస్ సినిమా

పూజా హెగ్డే తెలివితేటల కి పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా దండం పెట్టేస్తున్నారు !

Share

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది పూజా హెగ్డే. చెప్పాలంటే ప్రస్తుతం టాలీవుడ్ లో పూజా హెగ్డే టాప్ ప్లేస్ లో ఉంది. అందుకు కారణం తనకి లక్కీ హీరోయిన్ అన్న పేరు రావడమే. పూజా చేసిన మొదటి సినిమాలు ముకుంద, ఒక లైలా కోసం సినిమాలు హిట్ గా నిలిచాయి. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళి ఒక ఫ్లాప్ నెత్తిమీద పెట్టుకొని టాలీవుడ్ కి వచ్చి అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం చేసింది. ఈ సినిమా హిట్ అవడంతో ఇక ఇప్పటి వరకు టాలీవుడ్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

Nothing sexier than a white shirt", Pooja Hegde proves it with her ...

అంతేకాదు మహేష్ బాబు తో చేసిన మహర్షి, ఎన్.టి.ఆర్ తో చేసిన అరవిన సమేత వీర రాఘవ, వరుణ్ తేజ్ తో గద్దల కొండ గణేష్ వరసగా భారీ హిట్స్ గా నిలిచాయి. ఇక ఈ ఏడాది ప్రారంభంలోనే త్రివిక్రం శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో మరో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. చెప్పాలంటే ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచింది. దాంతో టాలీవుడ్ లో పూజా రేంజ్ అండ్ రెమ్యునరేషన్ భారీగా పెరిగింది.

ఇంకా చెప్పాలంటే రెమ్యునరేషన్ పరంగా నిర్మాతలకి షాకిస్తుందని అంటున్నారు. పెద్ద హీరోలే కరోనా కారణంగా తమ రెమ్యునరేషన్స్ తగ్గించుకుంటుంటే పూజా మాత్రం విషయంలో గట్టిగా ఉందట. అంతే కాదు ఇప్పటి నుంచి చిన్న హీరోలతో సినిమాలు చేయకూడదనుకుంటున్నట్టు తెలుస్తుంది. అందుకే నితిన్ తో ఒక సినిమా ఆఫర్ వస్తే నిర్మొహమాటంగా నో చెప్పిందని అంటున్నారు.

అయితే డైరెక్ట్ గా నో చెప్పకుండా ఇన్‌డైరెక్ట్ గా రెమ్యూనరేషన్ భారీగా అడిగితే వాళ్ళే డ్రాపవుతారులే అన్న స్ట్రాటజీ ఫాలో అవుతుందట. ఇది కూడా ముందు జాగ్రత్తే అని చెప్పుకుంటున్నారు. ఒకవేళ ఫ్యూచర్ లో సీన్ రివర్స్ అయితే మళ్ళీ ఆఫర్స్ కోసం ట్రై చేయోచ్చన్న భావన. ప్రస్తుతం పూజా హెగ్డే ప్రభాస్ తో రాధే శ్యామ్, అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలతో పాటు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సినిమా, అలాగే అక్షయ్ కుమార్ తో ఒక సినిమా చేస్తుంది. ఈసారి బాలీవుడ్ లో భారీ సక్సస్ అందుకోవాలని చూస్తుంది.


Share

Related posts

లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినతరం చేసిన హైదరాబాద్

Siva Prasad

అగ్నిప్రమాదంలో అంబులెన్స్‌లు దగ్ధం

somaraju sharma

కూతురు వ‌య‌సున్న అమ్మాయితో ర‌వితేజ రొమాన్స్‌.. ఏకేస్తున్న నెటిజ‌న్స్‌!

kavya N