బిగ్ బాస్ 4 : ఎలిమినేట్ అయిపోతున్నాడు అనుకున్న మెహబూబ్ సేవ్ అవ్వడానికి ఆఖరి నిమిషం లో జరిగింది ఇదే..!

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 సక్సస్ ఫుల్ గా కొనసాగుతుంది. గత సీజన్స్ కంటే ఈ సీజన్ అంత రసవత్తరంగా లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నప్పటికి జనాలు మాత్రం షోని బాగానే ఫాలో అవుతున్నారు. మొత్తాని ఈ సీజన్ మొదలై మూడు వారాలు కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు వారాలలోనే ముగ్గురు హౌజ్ మెట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షో లకి ఎంటరయ్యారు. అలాగే ఎలిమినేషన్స్ కూడా అయ్యాయి.

Bigg Boss Telugu 4: Mehaboob Dilse likely to get eliminated from the show? - Times of India

బిగ్‌ బాస్ నాలుగో సీజ‌న్‌లో జరిగిన ఎలిమినేష‌న్ లో ప్రముఖ న్యూస్ యాంకర్ దేవి నాగవల్లి ఎలిమినేట్ అవ్వడం అందరిని షాక్ కి గురిచేసింది. ముందు మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడని వార్తలు వచ్చాయి. అందరు కూడా అదే గట్టిగా ఫిక్సైయ్యారు. కాని అనూహ్యంగా చివరికి దేవి ఎలిమినేట్ అయి షాకిచ్చింది. అయితే దేవి నాగ వల్లితో పోల్చినప్పుడు మెహబూబ్ అంతగా ఎవ్వరికీ తెలియదు. అంత ఫేమస్ పర్సన్ కూడా కాదు. కానీ మెహబూబ్ కి ఆడియన్స్ ఊహించని విధంగా సపోర్ట్ చేశారు. ఇదే మెహబూబ్ సేవ్ అవడానికి ముఖ్య కారణం. అసలు ఇలా ఎలా జరిగింది అని దేవీ తో పాటు నాగ్ కూడా షాకయ్యారు.

Bigg Boss Telugu 4: Devi Nagavalli gives valuable advices to inmates

అయితే సోషల్ మీడియాలో మెహబూబ్ కి యూత్ ఆడియన్స్ లో ఎక్కువగా ఆదరణ, ఫాలోయింగ్ ఉంది. వాళ్ళే మెహబూబ్ కి ఎక్కువగాగా ఓట్స్ వేసి అతన్ని ఎలిమినేట్ కాకుండా సేవ్ చేశారని చెప్పుకుంటున్నారు. యూట్యూబ్‌లో తన డ్యాన్స్ వీడియోలతో మెహబూబ్ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆ పాపులారిటీనే మెహబూబ్ ని బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసే వరకు తీసుకు వచ్చింది. ఇప్పుడు ఎలిమినేట్ అవకుండా కాపాడింది మాట్లాడుకుంటున్నారు. ఇందులో ఎక్కువగా మెహబూబ్ ఊరు వాళ్ళు అధికంగా వోట్లు వేస్తున్నట్టు సమాచారం.