బిగ్ బాస్ అంటేనే అంచనాలకు అందకుండా సాగిపోయే షో. మనం ఒకటి ఊహిస్తే బిగ్ బాస్ నిర్వాహకులు మరొకటి చేయిస్తారు. వారి టాస్క్ లు, విధానాలు అలాగే ఉంటాయి. బిగ్ బాస్ సీజన్ 4 కు తెరలేవడంతో ఎంటర్టైన్మెంట్ కు కూడా కొదవ లేదని చెప్పాలి.
సాధారణంగా బిగ్ బాస్ సీజన్ మొదటి రోజున ఒకరి తర్వాత ఒకరుగా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు. ప్రతీసారిలా ఈసారి కాకుండా సరికొత్తగా ప్లాన్ చేసారు. ఈసారి బాక్స్ ల కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టారు. ఆ బాక్స్ లతో పెయిర్లుగా తీసుకొచ్చారు. అంతటితో అయిపోలేదు. ఇద్దరు కంటెస్టెంట్ లను హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వకుండా సీక్రెట్ రూమ్ లో ఉంచారు. వారే 9వ కంటెస్టెంట్ గా ఎంటరైన సీరియల్ యాక్టర్ సయ్యద్ సోహైల్, 10వ కంటెస్టెంట్ గా ఎంటరైన యాంకర్ అరియనా గ్లోరీ. మరి వీరితో ఎలాంటి గేమ్ ఆడించనున్నాడో.