తెలుగు బుల్లితెరపై బిగ్బాస్ చూపించే ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ రియాలిటీ షో లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ కూడా అతి సాధారణ వ్యక్తులుగా ప్రయాణం మొదలుపెట్టి కేవలం మూడు నెలల వ్యవధిలో స్టార్ హీరోల రేంజ్ లో పాపులర్ అయిపోతున్నారు. ముఖ్యంగా నాలుగో సీజన్ విన్నర్ అభిజిత్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. బిగ్ బాస్ తర్వాత ఫుల్ బిజీ అయిపోయిన అతను ప్రస్తుతం తన హవాను చూపిస్తున్నాడు.
తాజాగా ఒక విషయంలో అభిజిత్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయాడు. సినిమాల్లో పెద్దగా గుర్తింపు రాకపోయినా నాలుగవ సీజన్ లో కి వచ్చి రాగానే చాలా కూల్ పర్సనాలిటీతో అందరినీ ఆకట్టుకున్నాడు. లవ్ ట్రాక్ కొద్దిగా ఫోకస్ పెట్టిన అభిజిత్ టాస్కుల్లో కూడా పర్వాలేదనిపించాడు. అయితే మైండ్ గేమ్ తో మాత్రం పూర్తి మార్కులు కొట్టేశాడు. ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూల తో బిజీగా గడుపుతున్న ఈ బిగ్బాస్ విజేతకు ఇదే క్రమంలో కొన్ని సినిమాల్లో నటించే అవకాశాలు కూడా వచ్చాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇక అతను ఇంట్లో ఉన్న సమయంలో అతడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసిన విషయం తెలిసిందే. అతడి పేరు మీద హ్యాష్ ట్యాగ్ తో మిలియన్ల ట్వీట్లు వచ్చి నేషనల్ రికార్డు క్రియేట్ అయింది. దీంతో అభి క్రేజ్ రేంజ్ లో ఉందో అర్థం అవుతోంది. ప్రస్తుతం ట్విట్టర్ లో #100MostHandsomefaces2020 అనే ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. దీనికి చాలా మంది నెటిజన్లు స్పందిస్తూ తనకు నచ్చిన వ్యక్తిని నామినేట్ చేస్తున్నారు.
అయితే ఇందులో ఎక్కువ శాతం అభిజిత్ పేరు కనిపించడం గమనార్హం. బాలీవుడ్ హీరోలని సైతం వెనక్కి నెట్టేస్తూ అతని ఫ్యాన్స్ అభిజిత్ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇక ఈ జాబితాలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ పేరు కూడా కనిపిస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!