బిగ్ బాస్ నాలుగో సీజన్ ఇంటిలో ఒక్కసారిగా పరిస్థితులు వేడెక్కాయి. కొంతమంది కంటెస్టెంట్ అసలు రంగులు ఫైనల్స్ దగ్గరవుతున్నకొద్దీ బయటపడుతున్నాయి. మిత్రులుగా ఉండేవారు ఊహించని విధంగా శత్రువుల్లా మారిపోతున్నారు. ఇక మంగళవారం ఎపిసోడ్ విషయంలో జరిగిన సీన్స్ అఖిల్, సోహెల్ మధ్య మరోలా ఉన్నాయి.
ఇంటిలో కోపదారి మనిషి ఎవరంటే సోహెల్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమధ్య అఖిల్ కూడా తరచూ తన కోపాన్ని బయటపడుతున్నారు. వీరిద్దరి మధ్య అనుకోకుండా ప్రతిసారి గొడవ జరుగుతుంది. సాధారణంగా ఎవరికైనా సరే ఎలిమినేషన్ నామినేషన్ నుండి గొడవలు పెరుగుతాయి. కానీ వీరిద్దరికీ వేర్వేరు మనస్పర్ధలు విషయంలో విభేదాలు ఎక్కువవుతున్నాయి.
మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ పెద్దగా నిద్రపోలేదు సోహెల్ అయితే అఖిల్ తీరు పై ఒక రేంజ్ లో అసహనం వ్యక్తం చేశాడు. అనంతరం మళ్ళీ తినే దగ్గర అఖిల్ బుంగమూతి పెట్టుకోవడం సోహెల్ కు నచ్చలేదు. అతను కూడా తినకుండా వచ్చేసి అలిగి కూర్చున్నాడు. అఖిల్ హ్యాపీగా నిద్ర పోయాడు. ఇక వీరిద్దరి మధ్య మోనాల్ మళ్లీ ఫ్రెండ్షిప్ తీసుకురావడానికి బాగా ప్రయత్నం చేసింది. అయితే సోహెల్ ఆమె దగ్గర అసహనం వ్యక్తం చేశాడు. నాకు మాత్రమే కాదు అఖిల్ కు బుద్ధి కూడా చెప్పు అని గట్టిగా అరిచాడు.
తర్వాత హారిక కూడా వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. ఇలా కొట్లాటలతో బిల్డప్ ఇచ్చిన ఇద్దరూ అర్ధరాత్రి ఎదురుపడగానే కౌగిలించుకొని నవ్వుకున్నారు. వీరిద్దరి మధ్య అలగడం తర్వాత కౌగిలించుకోవడం చాలా కామన్ అయిపోయింది అని ఆడియన్స్ కు కూడా అర్థం అయింది. ఇక వారిద్దరినీ కలిపేందుకు అంత ప్రయత్నించిన మొదట వారిని చూసి షాక్ అయింది. ఆ తర్వాత ముసిముసిగా నవ్వుకుంది
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!