బిగ్‌బాస్ ఇంటిలో ఈవారం ఎలిమినేషన్ ప్రక్రియలో విపరీతమైన గందరగోళం నెలకొంది. అసలు గత వారం ఎలిమినేషన్ లో చివరిలో మిగిలిన మెహబూబ్, రాజశేఖర్ ఇద్దరిలో ఇంటిలో ఉండే అర్హత ఎవరికీ ఉందో చెప్పాలని నాగార్జున కోరడం పెద్ద వివాదాన్ని రేపింది. ఇంట్లోని సభ్యులందరూ అమ్మ రాజశేఖర్ కు అర్హత లేదని చెప్పి ఓట్లు వేయడం ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ అతనిని రక్షించడం తో ఆట మరింత రక్తి కట్టింది.
ఇక ఈ సమయంలో హారిక, మోనాల్ మధ్య జరిగిన సంభాషణ బిగ్ బాస్ ఎపిసోడ్ లో వైరల్ అయింది. అమ్మ రాజశేఖర్ తో నువ్వు మాట్లాడావా అని హారిక మోనాల్ ను అడిగింది. అందుకు మోనాల్ నేను క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించాను కానీ అతడు వినే పరిస్థితిలో లేడు చాలా కోపంగా ఉన్నాడు నా జీవితంలో నీతో మాట్లాడను అని చెప్పాడు అని వెల్లడించింది.
ఇక హారిక కూడా ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలుసు అందుకే నేను అతనితో మాట్లాడలేను అని చెప్పింది. ఆ తర్వాత వారి టాపిక్ నామినేషన్ కు వెళ్ళింది. నువ్వు నా పేరు ఉన్న యాపిల్ ను కోసినా నేను బాధపడలేదు అంటూ హారిక ను గట్టిగా కౌగిలించుకుంది. ఇద్దరు బెడ్‌పై కూర్చొని కౌగిలించుకొని ఒకరిని ఒకరు ఊరడించుకున్నారు.
అయితే అందరిలాగా నన్ను టార్గెట్ చేయడం తో నేను చాలా హర్ట్ అయ్యాను అని హారిక తన మనసులోని మాటను బయటపెట్టింది. నువ్వు అలా బాధపడటావు అని తెలిసుంటే నేను అలా చేయకుండా ఉండే దానిని అంటూ ఆమెకు సర్ది చెప్పింది. ఇలా ఇంటిలో ఉన్న గొడవలు అన్నీ ఎవరికి వారు పరిష్కరించుకుంటూ పర్సనల్ గా పరిష్కరించుకుంటూ ఉన్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!