బిగ్ బాస్ 4 : ఇంటిలో చివరగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే…

Share

బిగ్బాస్ ఇంటిలో నాలుగో సీజన్ ఎలిమినేషన్ రేపటి ఎపిసోడ్ లో చోటుచేసుకుంటుంది. ఇక ఈసారి ఎలిమినేషన్ లో అఖిల్ మినహాయించి మిగిలిన ఇంటి సభ్యులు అందరూ ఉన్నారు. అఖిల్ గ్రాండ్ ఫినాలే టికెట్ సంపాదించిన కారణంగా అతనిని నామినేషన్స్ నుండి తప్పించారు. ఇది ఇలా ఉంటే రేపు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ వివరాలు బయటకు వచ్చాయి.

 

దాదాపు ఇంట్లో అందరు స్ట్రాంగ్ కంట్స్తేంట్స్ మిగిలి ఉన్న కారణంగా ఉన్న ఒకరిద్దరు బలహీన కంటెస్టెంట్స్ అవుతారని అందరూ ఊహించారు. ఎన్నో వారాల నుండి ఇంటిలో లక్ పైన నెట్టుకొస్తున్న గుజరాతి బ్యూటీ మోనాల్ గజ్జర్ చివరికి ఇంటిముఖం పట్టిన ట్లు సమాచారం బయటకు వచ్చింది. అసలు ఆమె ఎప్పుడో ఎలిమినేట్ అయిపోవాలని ఎన్నో విమర్శలు వచ్చాయి.

బిగ్ బాస్ కేవలం ఆమెను గ్లామర్ షో కోసం, లవ్ ట్రాక్స్ ద్వారా ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ తెప్పించేందుకే ఇన్నిరోజులు ఇంటిలో ఉంచారని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే మూడు వారాల ముందు మోనాల్ ఎలిమినేషన్ ఖచ్చితం అనుకున్నప్పుడు ఆమె ఒక్కసారిగా ఇంటిలో విజృంభించింది. తనకు ఎంతో క్లోజ్ అయినా అఖిల్ పైన విరుచుకు పడింది.

ఇలా ఒక మూడు వారాలు నెట్టుకొచ్చింది అయితే గత వారం అవినాష్ స్థానంలో మోనాల్ ఎలిమినేట్ కావాల్సి ఉండగా నాటకీయ పరిణామాల మధ్య జబర్దస్త్ కమెడియన్ ఇంటి ముఖం పట్టాడు. ఇక ఈ వారం మాత్రం మిగిలిన ప్రతి ఒక్క స్ట్రాంగ్ కంటెస్టెంట్ కావడంతో ఆమెను ఎలిమినేట్ చేయక తప్పలేదు అని తెలుస్తోంది.


Share

Related posts

సైరాతో మెగాస్టార్ మ‌రో రికార్డ్‌

Siva Prasad

Viral Video: పోలీసులను చూసి పోసుకున్నాడు..! హల్చల్ చేస్తున్న వీడియో..!!

bharani jella

Today Gold Rate : ఈరోజు స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..!!

bharani jella