NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

LK Advani: అద్వానీకి భారతరత్న

LK Advani: బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ (96)కి దేశంలోనే అత్యున్నత పురస్కారం వరించింది. అద్వానీకి భారతరత్న అవార్డు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. 90వ దశకంలో ఉన్న బీజేపీ తొలి తరం నేత ఎల్ కే అద్వానీకి భారతరత్న పురస్కారం లభించడంతో ఆ  పార్టీ శ్రేణులు, అభిమానిలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎక్స్(ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్ కే అద్వానీజీకి భారతరత్న ఇస్తున్నారనే వార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తాను కూడా ఆయనతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించానన్నారు. ఎల్కే అద్వానీ రాజనీతిజ్ఞుడు, భారతదేశ అభివృద్ధిలో ఆయన ప్రముఖ పాత్ర  పోషించారని కొనియాడారు.

అద్వానీ చాలా కింద స్థాయి నుండి ఉప రాష్ట్రపతి వరకూ ఎదిగారని అన్నారు. అనేక కేంద్ర మంత్రి పదవులు నిర్వహించారన్నారు. పార్లమెంట్ లో ఆయనకు ఎంతో అనుభవం ఉందని అన్నారు. ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎప్పుడూ అదర్శప్రాయమైనవనీ, గొప్ప అంతర్ధృష్టులతో నిండి ఉన్నాయని పీఎం నరేంద్ర మోడీ శ్లాషించారు.

1927 నవంబర్ 8న ప్రస్తుత పాకిస్థాన్ (భారత్ విభజన కాకముందు)లోని కరాచీలో జన్మించిన ఎల్కే అద్వానీ అక్కడి సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్ లో ప్రాధమిక విద్యను అభ్యసించారు. ఆ తర్వాత పాక్ లోని హైదరాబాద్ డీజీ నేషనల్ కాలేజీలో న్యాయ విద్యను పూర్తి చేశారు. 1947లో ఆర్ఎస్ఎస్ కరాచీ విభాగం కార్యదర్శిగా పని చేశారు. బీజేపీ వ్యవస్థాపకుల్లో అద్వానీ కూడా ఒకరు.  నేడు దేశ వ్యాప్తంగా బీజేపీ విస్తరించడానికి, రెండు సార్లు అధికారంలోకి రావడానికి కూడా అద్వానీ చేసిన కృషి ఎంతో ఉంది. ఆయన చేపట్టిన రథయాత్రతో భారత్ దేశంలోనే హిందూ ఓట్లను పార్టీ పోలరైజ్ చేయగలిగింది.

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

Related posts

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju