Shakuntalam : ‘శాకుంతలం’.. టాలీవుడ్ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ. దీని గురించి అక్కినేని అభిమానులతో పాటు సినీ ప్రేమికులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జాను లాంటి డిజాస్టర్ తర్వాత సమంత అక్కినేని నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘శాకుంతలం’. దర్శక దిగ్గజం గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ముఖ్య పాత్రలో నటిస్తుండగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నారు. పౌరాణిక చిత్రంగా మహాభారతం ఆదిపర్వంలోని శాకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా గుణ శేఖర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ‘శాకుంతలం’ సినిమాలో ఐకాన్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ భరతుడుగా నటిస్తోంది. ఇటీవలే అర్హ షూటింగ్ లో జాయిన్ అయినట్టు చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలో ‘శాకుంతలం’ సెట్ కి అల్లు అర్జున్ వెళ్ళాడు. ఇదే సమయంలో దుష్యంతుడుగా నటిస్తున్న దేవ్ మోహన్ అల్లు అర్జున్ ని కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ విషయాన్ని తాజాగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాగా బాలీవుడ్ నటుడు కీలక పాత్రలో నటించబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. పాన్ ఇండియా రేంజ్ లో ‘శాకుంతలం’ రూపొందిస్తుండగా, ఇతర భాషలకు చెందిన ప్రముఖ నటులను కీలక పాత్రలకి ఎంచుకుంటున్నారు.
Shakuntalam : ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయిందని సమాచారం.
ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ విలక్షణ నటుడు కబీర్ బేడీ నటిస్తున్నట్టు నిర్మాత క్లూ ఇచ్చారు. ఇటీవల ఆయన రాసిన ‘స్టోరీస్ ఐ మస్ట్ టెల్: ది ఎమోషనల్ లైఫ్ ఆఫ్ ఏన్ యాక్టర్’ అనే బుక్ ని ‘శాకుంతలం’ చిత్ర నిర్మాత అయిన నీలిమ గుణకు ఇచ్చారు కబీర్. ఆ బుక్ అందుకున్న నీలిమ ‘థ్యాంక్ యు కబీర్ సర్. మీతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్తకాన్ని చదవకుండా ఉండలేను’.. అని తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. అంతేకాదు ‘శాకుంతలం’ హ్యాష్‌ట్యాగ్ ను కూడా జతచేశారు. దాంతో
కబీర్ బేడీ ‘శాకుంతలం’లో ఓ మంచి పాత్రకి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అయితే మేకర్స్ ఇంకా అధికారకంగా వెల్లడించలేదు. త్వరలో దీనిపై స్పష్టత రానుందని సమాచారం. ఇక ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయిందని సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను సమర్పిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2022లో అన్నీ సౌత్ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!