Bollywood-Satyadev: సత్యదేవ్ కు బాలీవుడ్ Bollywood-Satyadev ఆఫర్ అనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టిన సత్యదేవ్ హీరోగా ఎదిగి తానేంటో నిరూపించుకున్నాడు. హిందీలో ఆఫర్ దక్కించుకోవడంతో సత్యదేవ్ కృషికి గుర్తింపు దక్కినట్టేనని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా ప్రతిష్టాత్మకంగా, భారీ కాన్వాస్ లో తెరకెక్కుతున్న ‘రామసేతు’ సినిమాలో సత్యదేవ్ కు కీలకపాత్ర ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ఆర్కియాలజిస్టుగా నటిస్తున్నాడు. ప్రతిష్టాత్మకమైన కథాంశంతో, భారీ బడ్జెట్ తో రామసేతు తెరకెక్కుతోంది.
అభిషేక్ శర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రబాస్ ఆదిపురుష్ కు ఈ సినిమా పోటీగా భావిస్తున్నారు. ఇతర భాషల్లో కూడా విడుదల చేసేలా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దక్షిణాది నుంచి సత్యదేవ్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. తెలుగులో క్రేజ్, తమిళ్ లో గుర్తింపు ఉండటం, సహజమైన నటన సత్యదేవ్ కు కలిసొచ్చిందని అంటున్నారు. యాక్షన్ డ్రామాతో తెరకెక్కుతున్న రామసేతులో సత్యదేవ్ పాత్రపై ఇంకా క్లారిటీ రాలేదు. అక్షయ్ కుమార్ హీరో, పాన్ ఇండియా సబ్జెక్ట్.. పైగా బాలీవుడ్ ఆఫర్ కావడంతో సత్యదేవ్ ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇది తనకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నాట.
పవన్ కల్యాణ్ సినిమా అత్తారింటికి దారేదిలో ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్లో, మహేశ్-వెంకటేశ్ సినిమా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేశ్ ఫ్రెండ్స్ లో ఒకడిగా నటించాడు. ఆ తర్వాత చార్మి ప్రధాన పాత్రలో పూరి జగన్నాధ్ తెరకెక్కించిన జ్యోతిలక్ష్మిలో సినిమాలో ప్రధాన పాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బ్లఫ్ మాస్టర్ సినిమాలో హీరోగా నటించి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. ఏకంగా చిరంజీవి మెప్పు పొందాడు. రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ లో కూడా కీలకపాత్రలో మెరిసాడు. ప్రస్తుతం తిమ్మరుసు, గుర్తుందా శీతాకాలం సినిమాల్లో నటిస్తున్నాడు. మరోవైపు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ సినిమాలో కూడా సత్యదేవ్ కు అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!