Pushpa: టాలీవుడ్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో రికార్డులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని హీరోల అభిమానుల లో ప్రధానంగా వినబడేది ఐకాన్ స్టార్ బన్నీ ఫ్యాన్స్. అల్లు అర్జున్ అప్పట్లో నటించిన “అలా వైకుంఠపురం లో” సినిమా నుండి భారీ ఎత్తున సోషల్ మీడియాలో బన్నీ సోషల్ మీడియా టీం అదే రీతిలో అభిమానులు.. బన్నీ అప్డేట్లు రికార్డులు క్రియేట్ అయ్యేలా రాణిస్తూ వస్తున్నారు. “అలా వైకుంఠపురం లో” సినిమాలో.. సామజ వర గమన, భూట్ట బొమ్మ పాటలు భారీ ఎత్తున సోషల్ మీడియాలో రికార్డ్ లు క్రియేట్ చేయడం జరిగింది.
ఆ తరువాత “పుష్ప” సినిమా టీజర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక వ్యూస్, లైక్స్ సాధించే టీజర్ గా మొన్నటివరకు సరికొత్త రికార్డ్ నమోదు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమా టీజర్ రావడంతో.. మొదటి ప్లేస్ లో మహేష్ సినిమా ఉంది. ఇటువంటి తరుణంలో “పుష్ప” సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్ ఆగస్టు 13వ తారీకు రిలీజ్ కానుంది. దీంతో ఈ సాంగ్ తో సరికొత్త రికార్డులు సృష్టించడానికి బన్నీ అభిమానులు రెడీ అయ్యారు. దక్కో దక్కొ సాంగ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో దేవిశ్రీప్రసాద్ మంచి మాస్ మసాలా మ్యూజిక్ అందించడంతో.. బన్నీ అభిమానులు ఈ సాంగ్ తో కొత్త రికార్డ్స్ సోషల్ మీడియాలో క్రియేట్ అయ్యేలా రాణిస్తున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న మూడో సినిమా కావడంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. బన్నీ సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలకు సంబంధించిన పాటలు.. అని కూడా సూపర్ డూపర్ హిట్. ఆర్య, ఆర్య 2 సినిమాల పాటలు సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దీంతో పుష్పా సినిమా సాంగ్స్ ఏ విధంగా ఆడియన్స్ ని అలరిస్తాయి అన్నది సస్పెన్స్ గా ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!