NewOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపి సర్కార్ కు కేంద్రం గుడ్ న్యూస్

Share

ఏపి తో సహా దేశంలోని పలు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రెవెన్యూ లోటు భర్తీ కింద రాష్ట్రాలకు గ్రాంట్ విడుదల చేసింది.ఏపికి రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.879 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఇప్పటికే పలు విడతలుగా రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిదులను కేంద్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాపితంగా 14 రాష్ట్రాలు రెవెన్యూ లోటుతో సతమతమవుతున్నాయి. ఏపితో సహా అసొం, మణిపూర్, కేరళ, మేఘాలయ, మిజోరాం,. నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెెంగాల్ రాష్ట్రాలకు గానూ రూ.7,183 కోట్లు విడుదల చేసింది కేంద్రం. వీటిలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి అత్యధికంగా రూ.1,132 కోట్లు విడుదల చేసింది.

Central Government Releases Revenue Deficit funds to States

 

అస్సాం రాష్ట్రానికి 407.50 కోట్లు, హిమాచల్ ప్రదేశ్ కి రూ. 781.42 కోట్లు, కేరళ రాష్ట్రానికి రూ. 1097.83 కోట్లు, మణిపూర్ రాష్ట్రానికి రూ. 192.50 కోట్లు, మేఘాలయ రాష్ట్రానికి రూ. 86.08 కోట్లు, మిజోరాం రాష్ట్రానికి రూ.134.58 కోట్లు, నాగాలాండ్ రాష్ట్రానికి రూ. 377.50 కోట్లు, పంజాబ్ రాష్ట్రానికి రూ.689.50 కోట్లు, రాజస్థాన్ రాష్ట్రానికి రూ.405.17 కోట్లు, సిక్కిం రాష్ట్రానికి రూ.36.67 కోట్లు, త్రిపురకు రూ. 368.58 కోట్లు, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి రూ.594.75 కోట్లు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రూ.1132.25 కోట్లు కేంద్రం విడుదల చేసింది.

Advertisements

Obulapuram Mining Case: ఒబులాపురం మైనింగ్ కేసులో ఐఎఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట


Share

Related posts

YS Jagan: వాళ్లకు కీలక హెచ్చరిక చేసిన సీఎం వైఎస్ జగన్..!!

somaraju sharma

మెట్రో పాసింజర్ లకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..!!

sekhar

Water: గాజు గ్లాసులో మంచి నీటిని తాగితే ఏం జరుగుతుందో తెలుసా..!?

bharani jella