NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

గుంటూరు టీడీపీ ఎంపీ క్యాండెట్ ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు… అక్క‌డ నుంచి దిగుమ‌తి…!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి గెలుపు గుర్రం ఎక్కి తీరాల‌ని నిర్ణ‌యించుకున్న టీడీపీ.. ఈ క్ర‌మంలో వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతోంది. ఢీ అంటే ఢీ అనేలా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. ముందుకు సాగుతోంది. అధికార పార్టీ వ్యూహాలకు అదిరిపోయే వ్యూహాలు వేస్తూ.. బ‌ల‌మైన నాయ‌కుల‌ను ఎంచుకుంటోంది. ఈ క్ర‌మంలో కీల‌క‌మైన గుంటూరు నియోజ‌క‌వ‌ర్గానికి అబ్య‌ర్థిని ఖ‌రారు చేసిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

గుంటూరు పార్ల‌మెంటు స్థానం టీడీపీకి అత్యంత కీల‌కం. 2014, 2019 ఎన్నిక‌ల్లో ఈ స్థానాన్ని టీడీపీనే గెలు చుకుంది. బ‌ల‌మైన నాయ‌కుడిగా.. మంచి వాక్చాతుర్యం.. ఉన్న నేత‌గా ఇక్క‌డ నుంచి గెలిచిన గ‌ల్లా జ‌య‌దేవ్ గుర్తింపు పొందారు. ఆయ‌న ఇక్క‌డి స‌మ‌స్య‌ల‌పైనా పోరాటం చేశారు. ముఖ్యంగా రాజ‌ధాని వ్య‌వ‌హారంపై గ‌ళం వినిపించారు. ఫ‌లితంగా.. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా.. టీడీపీకి మంచి పేరు వ‌చ్చింది.

పైగా రాజ‌ధాని అమ‌రావ‌తి విస్త‌రించి ఉన్న తాడికొండ‌, మంగ‌ళ‌గిరి ఈ రెండు సెగ్మెంట్లు కూడా గుంటూరు పార్ల‌మెంటు ప‌రిధిలోనే ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరి నుంచి సాక్షాత్తూ చంద్ర‌బాబు త‌న‌యుడు అప్పుడు మంత్రిగా ఉన్న లోకేష్ ఓడిపోయారు. ఎంతో అభివృద్ధి చేసి రాజ‌ధాని ఇచ్చినా కూడా తాడికొండ‌, మంగ‌ళ‌గిరి సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఈ సారి ఈ రెండు సీట్ల‌లో భారీ మార్పు ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. అందుకే ఈ సారి గుంటూరు పార్ల‌మెంటు అటు వైసీపీతో పాటు ఇటు టీడీపీకి ప్రెస్టేజ్ సీటుగా మారింది.

సిట్టింగ్ ఎంపీ జ‌య‌దేవ్ రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పిన నేప‌థ్యంలో.. బ‌ల‌మైన ఈ సెగ్మెంట్‌ను నిల‌బెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే, గల్లా.. రాజ‌కీ యాల‌కు దూరం కావ‌డంతో టీడీపీ అంత‌ర్మ‌థ‌నంలో ప‌డింది. వైసీపీ ధాటిని త‌ట్టుకుని నిల‌బ‌డి.. సెగ్మెం ట్‌లో పార్టీని నిలబెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఎన్నారై నాయ‌కుడు, పార్టీకి ఎప్ప‌టి నుంచో విధేయుడిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్‌కు టీడీపీ టికెట్టు ఖాయమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన 2014లో నర్సరావుపేట లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ టికెట్‌ ఆశించారు.

అయితే.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. గ‌త ఎన్నిక‌ల్లోనూ టీడీపీ అవ‌కాశం ఇవ్వ‌లేక పోయింది. కానీ, ఆయ‌న మాత్రం పార్టీకి అండ‌గా ఉన్నారు. ఏ అవ‌స‌రం వ‌చ్చినా.. పార్టీకి స‌హ‌క‌రిస్తున్నారు. ఇటీవల చంద్ర‌బాబుపై కేసులు న‌మోదైన‌ప్పుడు కూడా చంద్ర‌శేఖ‌ర్ అమెరికాలో టీడీపీ ఎన్నారై విభాగం చేప‌ట్టిన ఆందోళ‌న‌ల‌కు శ్రీకారం చుట్టారు. బ‌ల‌మైన నాయకుడిగా, అంద‌రినీ క‌లుపుకొని పోయే నాయ‌కుడిగా కూడా పెమ్మ‌సాని గుర్తింపు పొందారు. తాజాగా ఆయ‌న ఏపీకి చేరుకున్నారు. వ‌చ్చే ఎన్నికల్లో దాదాపు ఆయ‌న గుంటూరు పార్ల‌మెంటు స్థానం నుంచే పోటీ చేయొచ్చ‌ని అంటున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju