ఒకప్పుడు టాలీవుడ్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా దాసరి నారాయణరావు వారికి తోడుగా ఉండేవారు. ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు ఆయన మీద భక్తి గౌరవాలతో ఉండేవారు. ఏ చిన్న కష్టం వచ్చినా దాసరి నారాయణరావు ఇంటి వైపు అడుగులు వేసేవారు. ఎంతో సులువుగా వారి కష్టాలను ఆయన పోగొట్టేవాడు. కానీ దాసరి నారాయణరావు కన్నులు మూశాక ఆ బాధ్యతలన్నీ చిరంజీవి తన భుజాలపై వేసుకున్నాడు. చిరంజీవి ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఆయనే ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్ద అని అందరూ భావిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం చిరు పెద్దరికాన్ని ప్రశ్నిస్తున్నారు.
కాళ్లు మొక్కే ప్రోగ్రామ్
నిజానికి చిరంజీవి ఎలాంటి పెద్ద బాధ్యతలు వద్దు అని అంటూనే పరోక్షంగా ఇండస్ట్రీకి తోడుగా నిలబడుతున్నారు. అలానే యంగ్ హీరోలా ఈవెంట్స్ కి వెళ్లి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. తాజాగా చిరంజీవిని ఒక సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా ఆహ్వానించారు. ఆ ఈవెంట్‌కి చిరు చాలా హుందాగా వెళ్లాడు. అయితే ప్రీ-రిలీజ్ ప్రోగ్రామ్‌కు వచ్చిన వాళ్లంతా ఈవెంట్‌ని పక్కనపెట్టి చిరు కాళ్లు మొక్కే ప్రోగ్రామ్ ని మొదలుపెట్టారు. మెగాస్టార్ ఈవెంట్లోకి అడుగుపెట్టగానే కమెడియన్ అలీ చిరు కాళ్లపై పడ్డాడు. ఇక ఆ సమయం నుంచి మొదలు చివరి వరకు అందరూ చిరు కాళ్లపై పడుతూ అతని ఆశీర్వాదాలు తీసుకున్నారు.
వద్దన్నా ఆగలేదు
చిరంజీవి వద్దని ఆపుతున్నా ఎవరూ తగట్లేదు. స్టేజ్ ఎక్కకముందు వరకు అందరూ కాళ్లు మొక్కడం ఓకే కానీ స్టేజ్ ఎక్కిన తర్వాత కూడా మూవీ మేకర్స్ అందరూ చిరు కాళ్ల మీద పడిపోయారు. మీడియా ముందు ఉన్నాం కదా అని కూడా చూసుకోలేదు. అందరూ ఒక పెట్టున పొలోమని కాళ్లుపై పడిపోతూ చిరంజీవిని కూడా నివ్వెర పరిచారు. చిరు ఆశీస్సులు ఉంటే సినిమా హిట్ అవుతుందని భావన ఉండొచ్చు కానీ మరి ఆ అభిమానం చిరంజీవిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!