సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోవడం, విడిపోవడం కామన్ అయిపోయింది.. అందులోనూ టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ అనిపించుకున్న నాగ చైతన్య, సమంత గతేడాది విడిపోయిన సంగతి తెలిసిందే.. ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్న వీరిద్దరూ.. కొన్నేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. వీరిద్దరూ హీరో, హీరోయిన్లు కావడంతో వీరి సంపాదనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.. వీరు కలిసి ఉన్నప్పుడు ఎంత సంపాదించారు?.. విడిపోయి ఎంత సంపాదిస్తున్నారు? అని చర్చించుకుంటున్నారు.
హీరోయిన్ సమంత ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆమె సంపాదన మొదట్లో తక్కువగానే ఉన్నా.. తర్వాత మంచి రెమ్యూనరేషన్ తీసుకుంటోంది..ఒక్కో సినిమాకు రూ.2 కోట్లు పారితోషికం తీసుకుంటూ తన ఆస్తులను బాగానే కూడబెట్టుకుంది.. ఒకవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు అడ్వర్టయిజ్‌మెంట్స్, బ్రాండ్స్ కూడా చేస్తుంది. అంతేకాదు.. సఖి అనే ఓ సంస్థ యజమాని కూడా.. మరో రెడు స్టార్టప్ కంపెనీల్లో కూడా పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది..
ఇక నాగచైతన్య మాత్రం సినీ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు..ఇప్పటికే తన తాత, తండ్రి సంపాదించిన ఆస్తులు ఎన్నో ఉన్నాయి. కానీ నాగచైతన్య మాత్రం సొంతంగా సినమాల్లో నటించిన సంపాదించినది రూ.40 కోట్లు.. కానీ సమంత మాత్రం నాగచైతన్య కంటే రెండింతలు ఎక్కువ సంపాదించింది. పెళ్లికి ముందే సమంత రూ.80 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.. ఇక విడాకుల తర్వాత సమంత తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసింది. కానీ, నాగచైతన్య మాత్రం సినిమాల పరంగా బిజీగా లేడు. చైతు సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. దీంతో సినిమా అవకాశాలు తగ్గినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ లో కూడా సమంత హవానే కాస్త ఎక్కువ కనిపిస్తోంది..
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!