టాలెంటెడ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్”. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు భలేభలేమగాడివోయ్, పిల్లానువ్వులేని జీవితం, గీతగోవిందం, ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్‌బస్టర్స్ తో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్న నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి అక్కినేని అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్ కు, అలానే స్టార్ సింగర్ సిద్ద్ శ్రీరామ్ పాడిన మనసా పాటకు, పూజా హెగ్డే ఫస్ట్ లుక్ కు అటు సోషల్ మీడియా లో ఇటు అభిమానుల్లో పాజిటివ్ రెస్పాన్ వచ్చింది. అంతేకాదు రీసెంట్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ టీం కపుల్ పోస్టర్ ని విడుదల చేసి సర్ప్రై ఇచ్చారు.
ఇప్పటికే 70 పూర్తయ్యి టాకీ పార్ట్ కంప్లీటయిన ఈ సినిమాకి కేవలం ఒక షెడ్యూల్ షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ వుంది. ఈ కరోనా క్రైసిస్ కొంచెం తగ్గితే ఈ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని సమాచారం. ఇక 2021 లో జనవరి లో విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు. అయితే ఆ సమయానికి ఆచార్య, నారప్ప, వకీల్ సాబ్, బాలకృష్ణ – బోయపాటి శ్రీనుల సినిమాలు వస్తే పరిస్థితేంటన్నది ఇప్పుడు చాలామంది చర్చించుకుంటున్నారట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!