Deepti Sunaina : సీరియల్ నటుడు, మోడల్ అయినటువంటి బిగ్‌బాస్ కౌశల్ తాజాగా ఓ మీడియా వేదికగా ఊహించని విధంగా మాట్లాడాడు. బేసిగ్గా మోడల్ అయినటువంటి కౌశల్.. బిగ్‌బాస్ షోతో ఊహించని పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. కేవలం ఒకే ఒక్క నిమ్మకాయ కాన్సెప్ట్ ఎపిసోడ్‌తో కౌశల్ ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. ఫలితంగా బిగ్‌బాస్ సీజన్-2 విన్నర్‌గా విజయ కేతనం ఎగర వేసాడు. ఇక కౌశల్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
Deepti Sunaina: ఎవరూ చేయని విధంగా నేను చేశాను అంటున్న కౌశల్!
ఈ నేపథ్యంలో కౌశల్ అనేక విషయాలను ప్రస్తావించాడు. బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన తర్వాత బహుశా, నాలాగా ఎవరూ చేసుండరు అంటూ తన గెలుపు కోసం కష్టపడిన వారందరిని తాను కలిశానని చెప్పుకొచ్చాడు. అక్కడితో ఆగకుండా ఇక్కడ లోకల్ లో ఉన్నవారినే కాకుండా విదేశాల్లో ఉన్న వారిని కూడా కలిశానని చెప్పాడు. ఇక సినిమాల సంగతి గురించి చెప్తూ.. కథలు తనకు నచ్చకపోవడం వల్ల కొన్ని వదులుకున్నానని, అలాగే రెమ్యునరేషన్ విషయంలో వెనక్కి తగ్గకపోవడం వలన కొన్ని ఆఫర్లు పోయాయని చెప్పుకొచ్చాడు.
దీప్తి సునైనాకు కౌశల్ కౌంటర్ ఇదే..
ఈ ఇంటర్వ్యూలో కౌశల్ ఉంచని విధంగా దీప్తి సునైనాకు గట్టి కౌంటరే ఇచ్చాడు. “బిగ్‌బాస్ షోలో నా అనుభవం అంత వయసు కూడా లేని దీప్తి సునైనా నేను 2 వారాల్లో ఇంటికి వెళ్లిపోతానని చెప్పడం.. నాకు ఎంతమాత్రమూ నచ్చలేదు!” దాంతో కౌశల్ అంటే ఏంటో చూపించాలని కష్టపడ్డాను. దాంతో టైటిల్ నా సొంతం అయింది. అంటూ చెప్పుకొచ్చాడు. కాగా కౌశల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.