YS Jagan: వైసీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ చార్జి దేవినేని అవినాష్ ఇవేళ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సిద్దం అంటూ సీఎం జగన్మోహనరెడ్డి ఉన్న ఫోటోను అవినాష్ పోస్టు చేశారు.
అయితే ఈ పోస్టుపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. వైసీపీకి ఏ సమస్య వచ్చినా టీడీపీ పైకి తోసేస్తారు అని ఒకరు కామెంట్ చేస్తే ..మరోకరు దేనికైనా సిద్దం అని మెన్షన్ చేయరా బాబు అని కామెంట్ పెట్టారు. కాగా మరో వ్యక్తి సిద్దం అనే పదాన్ని వాడి కొన్ని వ్యాఖ్యలే రాశాడు.
వైసీపీని ఇంటికి పంపించడానికి సిద్దం.. వైసీపీని అద్దెకు తీసుకున్న నాయకుడిని జైలుకు పంపడానికి సిద్దం.. దళితులను చంపించిన నాయకుడిని జైలుకు పంపించడానికి సిద్దం.. కోడికత్తి కేసులో శ్రీనుకి అన్యాయంగా అయిదు సంవత్సరాలు గా బెయిల్ రాకుండా అడ్డుకున్న వైసీపీ నాయకుడిని ఇంటికి పంపడానికి సిద్దం అని దేవినేని అవినాష్ చేసిన పోస్టుకు కామెంట్ చేశాడు.
దేవినేని అవినాష్ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై ఉన్న అభిమానంతో రానున్న ఎన్నికల్లో విజయం సాధించడానికి సిద్దం అనే ఉద్దేశంతో జగన్ ఫోటో పైన సిద్దం అని పేర్కొనగా, నెటిజన్స్ ఆ పదాన్ని వాళ్లకు నచ్చినట్లుగా మలుచుకుని ఆ పోస్టు పై స్పందిస్తుండటంతో సోషల్ మీడియాలో ఇది వైరల్ అయ్యింది.
YSRCP: మంగళగిరిలో నారా లోకేష్ ఓటమికి వైసీపీ అదిరిపొయ్యే వ్యూహం .. కీలక నేతకు బాధ్యతలు
సిద్ధం..#AdminPost #DevineniAvinash #YSJaganAgain pic.twitter.com/QcULpr0f4M
— Devineni Avinash (@DevineniAvi) January 24, 2024