Tollywood: సాధారణంగా ఎన్టీఆర్ కాలంలో సినిమాలు 100 కోట్లు రాబట్టాయి అంటే అదో పెద్ద సెన్సేషన్ అని చెప్పవచ్చు. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం ప్రతి ఒక్క హీరో 100 కోట్లని ఈజీగా క్రాస్ చేసేస్తున్నారు. టాలీవుడ్ మూవీస్ బడ్జెట్ లు పెరగడమే కాదు.. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రేంజ్ కూడా బాగా పెరిగిందని చెప్పొచ్చు. పాన్ ఇండియా హీరోలే కాకుండా సాధారణమైన హీరోలు సైతం 100 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి పెద్ద సెన్సేషన్ సృష్టిస్తున్నారు. అలా తమ యాక్టింగ్ తో థియేటర్లని షేక్ చేసి 100 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టిన హీరోలు మరియు సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. బాహుబలి:
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ” బాహుబలి 1 ” ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇక 100 కోట్ల ట్రెండ్ కూడా ఈ సినిమా నుంచే మొదలైంది. 600 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుని 300 కోట్ల షేర్ ని నమోదు చేసింది ఈ మూవీ.
2. రంగస్థలం:
రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో.. చిట్టి బాబు పాత్రని అద్భుతంగా పోషించి మంచి ఫేమస్ అయ్యాడు చెర్రీ. ఇక ఈ మూవీ సైతం 216 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెండో 100 కోట్ల షేర్ ని రాబట్టిన సినిమాగా నిలిచింది.
3. ఆర్ఆర్ఆర్:
తారక్ మరియు రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ మూవీ దేశవ్యాప్తంగా ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాతోనే జూనియర్ ఎన్టీఆర్ 100 కోట్ల షేర్ క్లబ్ లో అడుగుపెట్టాడు.
4. వాల్తేరు వీరయ్య:
చిరంజీవి హీరోగా నటించిన ఈ మూవీ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇక దీంతో 225 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుని 100 కోట్ల షేర్ క్లబ్ లో చేరాడు చిరు.
5. హనుమాన్:
రీసెంట్ గా రిలీజ్ అయిన హనుమాన్ మూవీ థియేటర్లలో ఎంతటి రచ్చ చేస్తుందో తెలిసిందే. ఈ సినిమా కూడా 209 కోట్ల కలెక్షన్స్ ని అందుకుని 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయింది.
ఇలా తమ సత్తా చాటుకుంటూ 100 కోట్ల క్లబ్ లో చేరారు ఈ హీరోలు.